today astrology: 8 ఆగష్టు 2020 శనివారం దినఫలాలు

By telugu news team  |  First Published Aug 8, 2020, 7:20 AM IST

ఈ రోజు మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఉత్సాహంతో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఓ వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న అవసరాలకు గాను అధికంగా శ్రమించాల్సి రావడం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఉత్సాహంతో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. 
కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. రచనా వ్యాసంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. హోదాలను పెంచే ఒకనొక సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో మెలకుల పాటించండి. వాహన సౌఖ్యం పొందుతారు. 
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు గ్రహబలం తక్కువగా ఉంది. ఓ సంఘటన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. కుటుంబంలో ఇతరుల జోక్యం అప్రశాంత వాతావరణానికి కారణమవుతుంది. మొహమాటాలకుపోయి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. చేబదుళ్లను అధికంగా చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఉన్నతాధికారులకు బహుమతులను అందించడానికి గాను చిన్నపాటి కొనుగోళ్లను సాగిస్తారు. అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు చేపడతారు. బంధుమిత్రులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి.
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు  సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల మెప్పును సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆధిక్యతను కలిగి ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల శుభవార్తలను అందుకోగలుగుతారు. సామాజికంగా మీ వ్యక్తిగత హోదాను పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో స్వల్పమైన అభివృద్ధిని సాధిస్తారు. 
 కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మానసిక సౌఖ్యం ఉంటుంది. బుద్ధి బలం బాగుంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన భేదాభిప్రాయాలను రూపుమాపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంది. మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు తలపెడతారు. కాంట్రాక్టుదారులకు శ్రమ మీద ఫలితాలు సానుకూల పడతాయి. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కీలకమైన పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడుదొడులేమి ఏర్పడవు. యాదార్ధవాదిలోక విరోధి అన్న నానుడి మీ అనుభవం లోకి వస్తుంది. సామాజిక సేవలో పాల్గొని ఔదార్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. 
కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాలి. అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నట్లు భావిస్తారు. ఈ-మెయిల్స్ వంటి సకాలంలో సరిచూసుకోవడం చెప్పదగిన సూచన. రహస్యమైన ఆలోచనలు ప్రణాళికలు ప్రధాన ప్రస్తావనాంశాలవుతాయి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సూత్రప్రాయంగా ఉంటాయి. ఉన్నత విద్యాభ్యాసానికి గాను బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!