today astrology: 07 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Aug 7, 2020, 7:02 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఓ శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కార్యాలయంలో అధికారుల మందలింపులు తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. గతంలో మీరిచ్చిన రుణాలు వసూలు అవుతాయి. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రక్త సంబంధీకుల దాయాదుల వల్ల సహాయం లభిస్తుంది. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటి వారి నుంచి ప్రతి స్పందన బాగుంటుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కొన్ని వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రకటనలు, మీడియాకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇరుగుపొరుగు వారితో వివాదాలు, కలహాలు తప్పకపోవచ్చు. నిదానమే ప్రధానమన్న సూక్తిని గుర్తుంచుకోండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంది. చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో ఎన్నో పనులను సానుకూల పరచుకుంటారు. మంచి రోజు వచ్చినట్లుగా తోస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కీలక భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొత్త ఆలోచనలు చేసి ఆచరణలో పెడతారు. శారరక రుగ్మత మానసిక కష్టానికి కారణం అవుతుంది. అకారణ కలహాలను ఆదిలోనే తుంచి వేయండి. మీ శక్తిని మించి ఒకానొక వ్యక్తిని ఆదుకుంటారు. ఊరట చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడతారు. స్థాయి తక్కువ వ్యక్తులతో పోరాడాల్సి వస్తుంది జీవిత భాగస్వామి నుంచి సహాయ సాకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. పట్టుదలతో శ్రమిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును కనబరుస్తారు. స్థిరాస్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. నలుగురిలో మంచి పేరును సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పెడచెవిన పెట్టరాదు. చేసిన చిన్న సహాయాన్ని భూతద్దంలో చూపించే సన్నిహితులు అధికమవుతారు. సాంకేతిక విద్యను ఆధారంగా చేసే ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోరాదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధిచడానికి చేసే శ్రమ ఫలిస్తుంది. నిష్కారణమైన విమర్శలు, అపవాదులు తప్పకపోవచ్చు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. ధనం ఖర్చు చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నట్లు తోస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నిష్కారణ భయం వేధిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఎంతో కాలంగా మీలో ఉన్న ఓ కోరిక ఈ రోజు నెరవేరుతుంది. చెల్లించాల్సిన డబ్బు కోసం ఒత్తిడి అధికమవుతుంది. మధ్యవర్తిగా ఉండి మాట్లాడేదానికన్నా మాట్లాడక పోవడం చెప్పదగిన సూచన. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుపుకుపోవాలి. జమాఖర్చులు పరిశీలించుకుంటారు. తల్లితరపు బంధువులకు సహాయాన్ని అందిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వాహన సౌఖ్యం ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!