today astrology: 5 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Aug 5, 2020, 7:10 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. ధనమే అన్నింటికీ మూలమని నిరూపించే విధంగా సంఘటనలు మీ అనుభవంలోకి వస్తాయి. చిరపరిచితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు పెట్టే వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి. కోర్టుకు సంబంధించిన కేసులను నూతన న్యాయవాదికి బదిలీ చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రమపెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులతోను, పెద్దలతోను కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానం కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా నడుచుకోవడం మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవి లేకపోయినా వేళకు ఆహారం తీసుకోరు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు పెద్దల సహాయ సాకారాలను అందుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. అనుకున్న పనిని, ప్రారంభించిన వ్యవహారాన్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. నిత్యవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంది. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోని ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు  బంధు మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన, దాన్య లాభాలున్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకుంటారు. చెల్లించాల్సిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వ్యాపారంలో రోటేషన్స్ బాగన్నప్పటికీ డబ్బు చేతికందదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. విద్యా, సారస్వత, వాణిజ్య రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తుల విధి నిర్వాహణను సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది. మీ మీ రంగాల్లో శక్తి సామార్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. క్రీడల్లో విందు, వినోదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆర్థికంగా అన్ని విధాల బాగుంటుంది. బంధువులతో విభేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలిసి వస్తారు. మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు బంధువులు, ఆత్మీయులతో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. వీలైనంంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతో కాలంగా మొండికి పడిని పనులు, వ్యవహారాలు ఓ దారికి వస్తాయి. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

click me!