ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దైవ కార్యాలకు, శుభకార్యాలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలపై దృష్టి సారిస్తారు. సంతృప్తి కలుగుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారులతో, పెద్దలు, ఉన్నతులతో అనుకూలత పెంచుకుంటారు.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దైవ కార్యాలకు, శుభకార్యాలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలపై దృష్టి సారిస్తారు. సంతృప్తి కలుగుతుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలలకోసం ఖర్చు చేసే అవకాశం.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. నూతన పరిచయాల వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. భాగస్వామ్య అనుబంధాల్లో కొంత అనుకూలత పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలవల్ల కొంత ఘర్షణ ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రుణ సంబంధ ఆలోచనల వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో తమకంటే ఉన్నతులతో పోటీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : క్రియేటివిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఏర్పడుతాయి. అనుకోని పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికలకు అనుగుణమైన పనులు పూర్తి చేస్తారు. సంతాన సమస్యలను అధిగమిస్తారు.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల సంతోషం పెరుగుతుంది. సౌకర్యాలకోసం ఆలోచనలు చేస్తారు. ఇంటి పనులు కొన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆహారం విషయంలో ఆలోచనలు పెరుగుతాయి. పెద్దలతో అనుకూలత పెంచుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలత పెరుగుతుంది. ఆత్మీయులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు నెరవేరుస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అందరూ సంతోషంతో ఆనందంగా కాలం గడుపుతారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి. పనుల ఒత్తిడి పెరుగుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ప్రణాళికలు పూర్తి చేయడంలో కొంత శక్తి అధికం అవుతుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పరామర్శలు చేస్తారు. పనులలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పరిశోధకులకు అనుకూలమైన సమయం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు పెరుగుతాయి. పెద్దలంటే గౌరవం, ఆదరణ పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేస్తారు. అన్ని రకాల లాభాలు లభిస్తాయి. పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు