today astrology: 2 జూన్ 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jun 2, 2020, 7:09 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. తమకంటే పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై మొగ్గు చూపుతారు.  ఇంటి సంబంధ వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.


డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తాయి. ఆదర్శవంతమైన జీవితం కోసం పాటుపడతారు. కంపెనీలలో వాటాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సోదరుల ద్వారా అనుకూలత పెరుగుతుంది. సోదర వర్గం దావరా ఆదాయం లభిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. తమకంటే పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై మొగ్గు చూపుతారు.  ఇంటి సంబంధ వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరిశోధక విద్యార్థులకు శ్రమ తప్పదు. దానికి తగిన ఫలితాలు రావు. అన్ని పనుల్లోనూ తొందరపాటు పనికిరాదు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. న్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. సోదవర్గం ద్వారా సంతోషం పెంచుకునే ఆలోచన.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ప్రమాదాలు వచ్చేసూచనలు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం. క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు అంత అనుకూలించవు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. వైవిధ్యాలు రాకుండా జాగ్రత్తపడాలి. పాత మిత్రుల కలయిక కొంత ఆనందం, కొంత ఒత్తిడి ఉటుంది. భాగస్వామ్య అనుబంధాలు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషంతో ఇంకా శ్రమ పడడానికి ఇష్టపడతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఔషధ సేవనం తగ్గిస్తారు. మొండితనం బాగా పెరుగుతుంది. అహంకారం రాకుండా జాగ్రత్తపడాలి. శత్రువులపై విజయం సాధిస్తారు.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ, ఒత్తిడి తప్పవు. చిత్తచాంచల్యం తగ్గించుకోవాలి. క్రియేటివిటీ తగ్గుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. మంత్రజపం అధికంగా చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. ఇంటి సంబంధ పనుల్లో ఆలస్యం మంచిది. విద్యార్థులకు కొంత వరకు అవగాహన తగ్గతుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. తల్లి సంబంధీకులతో వ్యవహరించే సమయంలో నిదానం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సోదర వర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. వారి సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి సమయం.  కమ్యూనికేషన్స్ వారు కొంత ఆలోచించాల్సి వస్తుంది. భూములు మొదలైన క్రయ విక్రయాల్లో తొందరపాటు పనికిరాదు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మాటల్లో కాఠిన్యత పెరుగుతుంది. ఆచి, తూచి మాట్లాడాలి. కుటుంబ సంబంధాలు ఇబ్బందిపడే అవకాశం. వాగ్దానాలు ఇవ్వకపోవడం మంచిది. నిల్వధనం తగ్గే సూచనలు ఉన్నాయి.  మధ్యవర్తిత్వాలు పనికిరావు. ఎక్కువ మౌనంగా ఉండడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం రావచ్చు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొంత శ్రమ అధికం అయినా తట్టుకొని నిలబడతారు. ప్రణాళికాబద్ధమై వ్యవహారం ఉంటుంది. మొండితనం పెరుగుతుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతి లభించదు. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు సూచనలు.  తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి.

click me!