ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు అనుకూలిస్తాయి. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. మాటలతో అనుబంధాలు పెంచుకుంటారు. పనులు సులభతరం చేసుకుంటారు. నిల్వధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్నీ నెరవేరుతాయి.
ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. తోటివారితో అనుకూలత పెరుగుతుంది. సంభాషణలు అనుకూలంగా ఉంటాయి. పరామర్శలు చేస్తారు. వ్యాపార కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు అనుకూలత పెరుగుతుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు అనుకూలిస్తాయి. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. మాటలతో అనుబంధాలు పెంచుకుంటారు. పనులు సులభతరం చేసుకుంటారు. నిల్వధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్నీ నెరవేరుతాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శ్రమ ఎక్కువౌవుతుంది. ఆశయాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలకు అనుకూలమైన దృక్పథాలు నెరవేరుతాయి. మంచి సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడానికి శ్రమను తట్టుకుని నిలబడతారు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసిక వ్యధ అధికం అవుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. సుఖంకోసం ఆలోచిస్తారు. దేహసౌఖ్యం కోసం ఆలోచిస్తారు. ఇతరులపై ఆధారపడతారు. దేహసౌఖ్యం లోపిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : లాభాలు సద్వినియోగం అవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు. ఆదర్శవంతమైన జీవితం. అన్ని రకాల లాభాలు అనుభవిస్తారు. సాత్త్విక ఉపాసనపై ఆలోచన పెంచుకుంటారు. దురాశ ఏర్పడుతుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలపై ఆలోచన పెరుగుతుంది. సాంఘిక రాజకీయ విషయాలు. వ్యాపార ప్రయత్నం అధికం అవుతుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలపై అనుకూలత పెరుగుతుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిశోధకులకు అనుకూలమైన సమయం. గురువులు విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార ధోరణి తగ్గించుకోవాలి. శుభకారాయల్లో పాల్గొంటారు. తమకంటే ఉన్నతులపై ఆలోచన పెరుగుతుంది. విద్య, వ్యాపారాల వల్ల గౌరవం పెరుగుతుంది. సంతృప్తి తగ్గుతుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆకస్మిక లాభ, నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయ సముపార్జన. చెడు సహవాసం పై ఆలోచన వెళుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు, పరామర్శలు చేస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. పదిమందిలో గౌరవంకోసం ఆలోచన. వ్యాపార ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధకశక్తి పెంచుకుంటారు. అనారోగ్య సూచనలున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. అనుకున్న పనులు పూర్తిచేసి చూపిస్తారు. అహంకారం ప్రదర్శించకూడదు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సంబంధ ఆలోచనలు ప్రశాంతతను ఇస్తాయి. వ్యాపార అభివృద్ధికై ఆలోచనలు పెరుగుతాయి. ఆత్మీయతలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలపై ఆలోచన పెరుగుతుంది. వాటివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. ఇంటి సంబంధ పనుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆహార సంబంధంలో కొంత లోపం ఏర్పడుతుంది. సమయానికి ఆహారం తీసుకోవాలి.