today astrology: 31జనవరి 2020 శుక్రవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jan 31, 2020, 7:31 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కీర్తి ప్రతిష్టలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు  అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : :  పెద్దల ఆశీస్సులు లభిస్తుంది. లాభాలపై దృష్టి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కార్యాలయాల్లో అప్రమతత్త అవసరం. బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామజపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కీర్తి ప్రతిష్టలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు  అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. మధ్యవర్తిత్వాలు, వాగ్దానాలు చేయరాదు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. కంటి సంబంధ లోపాలకు అవకాశం. 

Latest Videos

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆకస్మిక లాభాలు వస్తాయి. ఊహించని సంతోషం దరి చేరుతుంది. పరామర్శలకు అవకాశం. ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఔషధసేవనం తప్పనిసరి.  అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వాములతో పనుల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులను స్థాన చలనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడి ఉంారు. అన్ని రకాల లోపాలు ఉరాయి. శ్రీరామజయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంతాన సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. అధికారులతో అననుకూలత ఉంటుంది. సేవకులతో అనుకూలత ఉంటుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  శత్రువులపై విజయం సాధిస్తారు. సౌకర్యాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వీరు విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యాపారస్తులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్‌ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలంకరణవస్తువులపై దృష్టి ఏర్పడుతుంది. వాక్‌చాతుర్యం పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శరీరానికి శ్రమ అధికం అవుతుంది. ప్రణాళిక బద్ధమైన ఆలోచనలు. ఆలోచనలు అనుగుణమైన కార్యాచరణ అవసరం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తివిద్యలోరాణింపు ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాయామం అవసరం. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : :  అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అవసరం. పరామర్శలు చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు ఉండదు. ఆత్మీయత లోపిస్తుంది. సృజనాత్మకత కోల్పోతారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది.

డా. ఎస్‌. ప్రతిభ

click me!