30 మే 2020 శనివారం రాశిఫలాలు

By telugu news teamFirst Published May 30, 2020, 7:02 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరగా అలసిపోతారు.  రూప సౌందర్యంపై ఆలోచన చేస్తారు. ఆలోచనలకు అనుగుణమైన పనులు పూర్తి చేయడంలో కొంత పట్టుదల అవసరం అవుతుంది. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి.

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : మాటల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకర్షణీయమైన మాటలు ఉంటాయి. ఎదుటివారిని ఆకర్షిస్తారు. కళాకారులకు అనుకూలమైన సమయం. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. నిల్వధనం పెంచుకుంటారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరగా అలసిపోతారు.  రూప సౌందర్యంపై ఆలోచన చేస్తారు. ఆలోచనలకు అనుగుణమైన పనులు పూర్తి చేయడంలో కొంత పట్టుదల అవసరం అవుతుంది. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విహార యాత్రలు, విందులు వినోదాలపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో సౌఖ్యం వెతుకుతారు. అనవసర ఖర్చులు చేస్తారు. కళాకారులకు గుర్తింపు లభించే సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆశయాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు.  శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. అన్ని పనులు పూర్తి చేస్తారు. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : తాము చేసే వృత్తులపై అనుకూలత పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. సంఘంలో గౌరవం పెంచుకుంటారు. కీర్తి ప్రతిష్టలపై ఆలోచన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత సంతోషంగా కాలం గడుపుతారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కళాకారులకు తాము చేసే వాటిలో ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిశోధనలకు అనుకూలమైన సమయం. విహార యాత్రలు చేయాలనే ఆలోచన.  సజ్జన సాంగత్యం లభిస్తుంది. మొత్తంపై చేసిన పనిలో సంతృప్తి లభిస్తుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదన వస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంటాయి. ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  ఇతరులపై ఆధారపడతారు. లాటరీల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక అనుబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో పరిచయం పెంచుకుంటారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. కొంత అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. జీవిత భాగస్వాములతో అప్రమత్తంగా మెలగాలి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. శ్రతువులపై విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. శ్రమకు తగిన ఫలితం లభించదు. పోటీలను తట్టుకునే విధంగా ప్రయత్నం అవసరం. అనారోగ్య సూచనలు వస్తాయి. తొందరపాటు పనికిరాదు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. తొందరపాటు వ్యవహారాలు కూడదు. బంధుమిత్రుల దర్శనం చేస్తారు. సంతానం విషయంలో కొంత ఆలోచన చేస్తారు.  క్రియేటివిటీ పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాలు పెరుగుతాయి. సౌకర్యాల వలన సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీలతో అనుకూలత పెరుగుతుంది. ఇంటి సంబంధ పనులలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అన్ని పనులు పూర్తవుతాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీలతో సహాయ సహకారాలు పెరుగుతాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియారంగం వారికి అనుకూలమైన సమయం.

click me!