today astrology: 28మే 2020 గురువారం రాశిఫలాలు

By telugu news team  |  First Published May 28, 2020, 8:12 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాక్ చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుస్తారు.  మధ్యవర్తిత్వాలు పెరుగుతాయి. కుటుంబంలో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తులపై ఆలోచన ఎక్కువ చేస్తారు.


 డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : వ్యాపారస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతోషంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. రచయితలకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు కొంత ఒత్తిడి కలుగుతుంది. ప్రయాణాలలో సంతోషం లభిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుస్తారు.  మధ్యవర్తిత్వాలు పెరుగుతాయి. కుటుంబంలో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తులపై ఆలోచన ఎక్కువ చేస్తారు.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. నరాల సంబంధ నొప్పులు వచ్చే అవకాశం. అనుకోని ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతి లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. వ్యాపార ఖర్చులు అధికం అవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.  విలాసాలపై ఆలోచన తగ్గించుకోవాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని రకాల లాభాలు ఆస్వాదిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.  కన్ని శ్రమలేని లాభాలు సంపాదిస్తారు. కళాకారులకు అనుకూలమైన సమయం. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత పెంచుకుంటారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో వ్యాపార ప్రయాణాలు చేస్తారు. ఇతరులపై దయ చూపిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిశోధకులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. విహార యాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. విదేశీ వ్యవహారాలు పెరుగుతాయి. దూరదృష్టితో ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మొత్తంపై సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  శ్రమలేని ఆదాయంపై దృష్టి సారిస్తారు. ఆకస్మిక ధనం వచ్చే సూచనలు. వ్యాపారాలు కొనసాగుతాయి. క్రయ విక్రయాలపై ఆలోచన పెరుగుతుంది. పరాధీనులౌతారు. అనారోగ్య సూచనలు పెరుగుతాయి. అనవసర ఇబ్బందులు కొని తెచ్చకోకూడదు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. భాగస్వామ్య అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు దోహదపడతాయి. వ్యాపారస్తులకు కొంత అనుకూలమైన సమయంగా భావించవచ్చ.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. వ్యాపార రంగంలో పోటీలను ఎదుర్కొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలను నేర్చుకుంటారు. శారీరక బలం పెరుగుతుంది. అందరితో అనుకూలంగా ఉంటారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చిత్త చాంచల్యం ఉంటుంది. సంతాన సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయంఉంటుంది. అందరితో ఆత్మీయత పెంచుకుంటారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు అనుకూలమైన సమయం. కష్టపడి అనుకున్న పనులు సాధిస్తారు. మాతృసౌఖ్యం కోసం ఆలోచిస్తారు. ప్రాథమిక విద్యలు అనుకూలిస్తాయి. తల్లి తరఫు వారితో అనుకూలత పెంచుకుంటారు. సౌకర్యాలపై ఆలోచన పెరుగుతుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి.

click me!