ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆదర్శవంతమైన జీవితం కోసం పాటుపడతారు. అన్ని రకాల లాభాలు లభిస్తాయి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ఆలోచన. విశ్రాంతికై ప్రయత్నం అధికం అవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. రచయితలకు కొంత ఒత్తిడి ఏర్పడే సమయం. అన్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆదర్శవంతమైన జీవితం కోసం పాటుపడతారు. అన్ని రకాల లాభాలు లభిస్తాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆలోచిస్తారు. శారీరక శ్రమ అధికం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. చేసే పనుల్లో నైపుణ్యం సాధించాలి. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికై ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై ఆలోచన. పరిశోధకులకు కొంత ఒత్తిడి సమయం. దూరదృష్టి పెంచుకుంటారు. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు అధికం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అన్ని రకాల ఆదాయాలు లాభిస్తాయి. కళాకారులకు కొంత అనుకూలమైన సమయం. ఆశయాలు పూర్తి కావు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నూతన పరిచయస్తులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మోసపోయే సూచనలు ఉన్నాయి. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. తమకంటే ఉన్నత స్తితిలో ఉన్నవారితో పరిచయాలు స్నేహాను బంధాలు పెంచుకుంటారు. అధికారిక ప్రయాణాలు అవసరం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పరిశోధకులకు కొంత అనుకూలమైన సమయం. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తపడాలి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రమ, కాలం, ధనం, వ్యర్థం అవుతాయి. పరామర్శలు చేస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. గృహ సంబంధ పనుల్లో కొంత జాప్యం ఏర్పడవచ్చు. సామాజిక అనుబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం. అత్యాశ అధికం అవుతుంది. నూతన పరిచయస్తుల వల్ల మోసపోయే ప్రమాదం. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ సంబంధ ఆలోచన తీరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పనుల్లో సాధికారత పెరుగుతుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మధ్యవర్తిత్వాలు పనికిరావు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన ఆలోచనల్లో చికాకులు వస్తాయి. వాక్ చాతుర్యం తగ్గుతుంది. కుటుంబలోపాలు పెరుగుతాయి. క్రియేటివిటీ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమను తట్టుకొని నిలబడగలుగుతారు. అనుకున్న పనులు పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి పెంచుకుంటారు. ఇంటి సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.