ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్ద ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. తరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికై ఆలోచన పెరుగుతుంది. అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో చి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. అనవసర ఖర్చులు చేస్తారు.వాక్ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్ద ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. తరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నిస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తిప్రతిష్టలపై ఆలోచన. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దేహసౌఖ్యం లోపిస్తుంది. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. పరిశోధకులకు కొంత కష్టకాలం. శాసనకర్తలుగా వ్యవహరిస్తారు. అధికార వ్యవహారాలు చేస్తారు. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. సంఘవ్యవహారాల్లో అనుకూత ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు అవుతాయి. లాభాలు దుర్వినియోగం అవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. రాచకార్యాలపై దృష్టి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. పాత స్నేహితులను దర్శించే ఆలోచన ఉంటుంది. ఆహారంలో జాగ్రత్త అవసరం. శాస్త్ర విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకు సాధన చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆచి, తూచి వ్యవహరిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైద్యశాలల సందర్శనం. శ్రమలేనిఆదాయంపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో అనుబంధాల్లో అనుకూలత. భాగస్వాములతో సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది . పోటీల్లో ఒత్తిడితో గెలుపు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ ఆలోచనలు తీరుతాయి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తక్కువ అవుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. సంతృప్తి తక్కువ ఉంటుంది. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు అనుకూలం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాలవల్ల ఒత్తిడి. సుఖం కోసం ఆలోచిస్తారు. మాతృసౌఖ్యం లోపిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. పరామక్రమం ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్ వల్ల సంతృప్తి ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి.