ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్లకండి. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో అభిప్రాయభేదాలు చోటు చేసుకుంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. దైవదర్శనం చేసుకుంటారు. శుభఫలితాలు ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్లకండి. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తిలో మీరు చూపించే నైపుణ్యానికి గాను మంచి అభివృద్ధిని సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మిశ్రమ కాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు పూర్తవుతాయి. ఖర్చు అధికంగా ఉన్నా సంతాన పరమైన పురోభివృద్ధి బాగుటుంది. గుడ్ విల్ ను పెంపొందించుకోగలుగుతారు. మీ ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఏకాగ్రతతో కార్యక్రమాలను చక్కబరుస్తారు. వ్యక్తిగత ఆర్థిక స్థితి పురోగతిలోనే ఉన్నా ఫలితాలు చేతికి అందిరావు. సంయమనం, ఓర్పును అధికంగా కనబరుస్తారు. రుణాలు మంజూరు అవుతాయి. తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు వాస్తవాలను జీర్ణించుకోలేని వ్యక్తుల వల్ల చికాకులు ఏర్పడతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వస్తువుల కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో స్నేహభావంతో మెలగడం చెప్పదగినది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. సన్నిహిత వర్గం సహాయ సాకారాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం దక్కుతుంది. వినూత్న రీతిలో రాజీ యత్నాలు సాగిస్తారు. మీ వైఖరి మంచి మార్పునకు కారణం అవుతుంది. సుదూర ప్రాంత విషయాలు లాభిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్థిక పరమైన అంశాల్లో మెలకువలు అవసరం. దైవదర్శనం చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అనూహ్యంగా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంతానం అభివృద్ధి మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు క్లిష్టమైన సమస్యలను శ్రుతిని మించి రాగాన పడకుండా చేయగలుగుతారు. మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.వాదప్రతివాదాలకు జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాల్లో సమతూల్యత ఏర్పడుతుంది. చాలా వరకు మీ అంచనాలు నిజమవుతాయి. ఇంటర్వల్లో విజయం సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంది. తోటి వారి సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల మెప్పును అందుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరిని కలుపుకునిపోవడం వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థికాభివృద్ధిపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. బంధువులతో సంభాషణలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.