today astrology: 17మే 2020 ఆదివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published May 17, 2020, 8:37 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనలు పెంచుకుంటారు. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం. పరిశోధకులకు కొంత అనుకూలమై, కొంత ఒత్తిడి కలిగిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. సంతృప్తి మొత్తంపై తక్కువగా ఉంటుంది.


 డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. సమాజంలో గౌరవం కోసం ఆరాట పడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం జరుగవచ్చు. అధికారులతో అనుకూలత తగ్గే సూచనలు వున్నాయి. అధికారిక ప్రయాణాలు చేస్తరు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనలు పెంచుకుంటారు. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం. పరిశోధకులకు కొంత అనుకూలమై, కొంత ఒత్తిడి కలిగిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. సంతృప్తి మొత్తంపై తక్కువగా ఉంటుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడులు ఉండే సూచనలు. ప్రమాదాలకు అవకాశం. అనారోగ్య సమస్యలు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో కొంత లోపం ఏర్పడుతుంది.  పెంచుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు అంత అనుకూలించవు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. మోసపోయే సూచనలు ఉన్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నం మొదలౌతుంది. రుణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. పరీక్షల్లో గెలుపుకోసం ప్రయత్నం చేస్తారు. రోగనిరోధకశక్తి కొంత పెరిగి కొంత తగ్గుతుంది. జాగ్రత్తగా ఉండాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చిత్త చాంచల్యంతో పనులు పూర్తి చేయకూడదు. సంతాన సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. సృజనాత్మకత తగ్గుతుంది. ప్రణాళికలకు సంబంధించిన పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. సౌకర్యాల వలన కొంత ఒత్తిడి మొదలౌతుంది. గృహనిర్మాణ పనులు ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ప్రమాదాలకు అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు కొంత శ్రమ అవుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేసే ఆలోచనలు ఉంటాయి. తోటి వారి సహాయ సహకారాలు అందించుకునే ప్రయత్నం చేస్తారు. మీడియారంగం వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు కొంత ఒత్తిడి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్ చాతుర్యం తగ్గతుంది. మాట విలువ తగ్గుతుంది. కుటుంబ సంబంధాల మధ్య కొంత దూరం పెరుగుతుంది. మధ్యవర్తి వ్యవహారాలు పనికిరావు. నిల్వ ధనం కోల్పోయే సూచనలు ఉన్నాయి.  ఆర్థక సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక  శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కాలం, సమయం, శ్రమ దుర్వినియోగం అవుతాయి. పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేయడం మంచిది. కొంత బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం అవసరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలపై ఆలోచనలు పెరుగుతాయి. పాదాల నొప్పులు వచ్చే సూచనలు. ప్రయాణాలలో ఒత్తిడి పెరుగుతుంది. కాలం, ధనం వృథా అవుతాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల పనులు పూర్తి చేయాలనే ఆలోచన పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మంచిది. శ్రమలేని సంపాదనకోసం ఆలోచనలు పెరుగుతాయి. అన్ని పనులు అనుకూలింపచేసుకునే ప్రయత్నం చేస్తారు.

 
    
click me!