ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడోంలో అధికంగా శ్రమ ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనుల్లోను తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : బంధువులు మిత్రులతో చాకచక్యంగా మాట్లాడుతారు. వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడోంలో అధికంగా శ్రమ ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనుల్లోను తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : తమ చుట్టూ జనాలని తిప్పుకుంటారు. ఆనందకర వాతావరణం. విహార యాత్రలకై డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. దాన ధర్మాలకై డబ్బు ఖర్చు చేయాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతోషకర వాతావరణం ఏర్పరుచుకుంటారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తాయి. వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలించే సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన ఫలితం రాకపోవచ్చు. ఉద్యోగస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నం తప్పనిసరి. వ్యాపారాలలో అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులకు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలు పూర్తి చేస్తారు. మంత్రజపాలు చేయడం మంచిది. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని కలిగిస్తాయి. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీలలో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలలో తొందరపాటు పనికిరాదు. శత్రువులపై విజయం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం అవసరం అవుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. తమపూ తమకు కొంత శ్రద్ధ పెరుగుతుంది. తమ గురించి తాము ఆలోచిస్తారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నం అవసరం. సంతాన సంబంధ లోచనల్లో తొందరపాటు పనికిరాదు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. గృహ నిర్మాణ పనులు వాయిదా వేయటం మంచిది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఆహారంలో వీరు సమయపాలన పాటించా