today astrology: 16 జూన్ 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jun 16, 2020, 7:01 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.


డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.  అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం.వ్యాపారస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి.  దాన ధర్మాలకై డబ్బు ఖర్చు చేయాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఉద్యోగ ప్రయత్నం తప్పనిసరి. వ్యాపారాలలో అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి.  సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మంత్రజపాలు చేయడం మంచిది. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం అవసరం అవుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి.  జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :  వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రతువులపై విజయం సాధిస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని పనుల్లోనూ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. గృహ నిర్మాణ పనులు వాయిదా వేయటం మంచిది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  శ్రమకు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం అవసరం అవుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి.  సంతాన సంబంధ లోచనల్లో తొందరపాటు పనికిరాదు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి..

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు బలపడతాయి.  నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఆహారంలో వీరు సమయపాలన పాటించాలి. తీసుకునే ఆహారం ఆలోచించి తినాలి. పనులు పూర్తి చేయడోంలో అధికంగా శ్రమ ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం,ధనిష్ఠ1,2 పాదాలు) :  తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. తమ చుట్టూ జనాలని తిప్పుకుంటారు. ఆనందకర వాతావరణం. విహార యాత్రలకై డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) :    నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతోషకర వాతావరణం ఏర్పరుచుకుంటారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తాయి. వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలించే సమయం  అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  ఏ పనుల్లోను తొందరపాటు పనికిరాదు.  వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నం తప్పనిసరి. వ్యాపారాలలో అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి.  సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు

 

click me!