ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మా వ్యూహాలు ఫలిస్తాయి. ఎవరినీ లెక్కచేయకుండా మొండి వైఖరిని అవలింభిస్తారు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు రాజకీయ పలుకుబడి పెంపొందించుకోగలుగుతారు. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిష్కారణమైన అంతరంగిక భయం నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మానసిక సంతోషానికి కారణం అవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు శుభఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మా వ్యూహాలు ఫలిస్తాయి. ఎవరినీ లెక్కచేయకుండా మొండి వైఖరిని అవలింభిస్తారు. వ్యాపారస్తులకు లాబాలు రోటేషన్ల రూపంలో ఉంటాయి. కొన్ని విషయాలలో వాయిదాలు ఉంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేసుకోగలుగుతారు. మీకు దక్కిన అధికార పత్రం ద్వారా పరోక్షంగా లాభపడతారు. గృహవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ కంటూ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. ప్రయాణాలు లాభించవు. చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. సమన్యాయం లోపించినట్లు భావిస్తారు. సంతాన విషయమై దీర్ఘాలోచనలు సాగిస్తారు. సుదూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు విదేశీ సంబంధిత అవకాశాలు మీ రక్తసంబంధీకులకు కలిసి వస్తాయి. ఖర్చు పెట్టే రూపాయికి ఓ అర్థం ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. లాభించదు అనుకున్న ప్రతి విషయాన్ని నిర్మొహమాటంగా త్రోసి పుచ్చుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థిత ప్రజ్ఞతో వ్యవహరించాలి. ధనాదాయ మార్గాలు కలిసి వస్తాయి. ప్రతిష్టంబన ఏర్పడిన వ్యవహారాల్లో ప్రతిష్టకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. మీపై వచ్చిన నిందల బరువును దించుకోగలుగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు సర్వసాధారణమైన విషయాలకు భావోద్వేగం కలిగి ఉంటారు. పొదుపు పథకాలను పాటిస్తారు. విలువైన కాలాన్ని ఉపయోగించుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. సలహాలు సూచనలతో ఇతరులను మార్చలేమని తెలుసుకుంటారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామితో విభేదాలు సమసి పోతాయి. చేసే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంజాయిషీలను ఇవ్వవలసి రావచ్చు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమను కలిగి ఉంటారు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సరికొత్త వ్యాపారాలు చేసే వారు సన్నిహితులవుతారు. పెద్దగా అనుభవం లేని అంశాల పట్ల ఈ రోజు దృష్టిని సారిస్తారు. ప్రభుత్వ పరంగా లాభించవలిసిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి. సలహాలు సూచనలతో ఇతరులను మార్చలేమని తెలుసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు పర్యావేక్షణా లోపం లేనంతవరకూ ఇబ్బందులు ఏర్పడవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశాల్లో మీ వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొత్త వారిని నమ్మి కీలకమైన బాధ్యతను వారికి అప్పగిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. మనసును కదల్చి వేసే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సనాతన సంప్రాదాయ విద్యలపైన మక్కువ ఎక్కువగా చూపుతారు. శుభసమయం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.