today astrology: 12 జులై 2020 ఆదివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 12, 2020, 7:00 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉన్నత విద్యవలన కొంతశ్రమ అధికం అవుతుంది. పరిశోధకులకు అనుకున్న స్థాయిలో తమ పరిశోధనలు పూర్తి చేయలేరు. ప్రతీ విషయంలోనూ ఒత్తిడి అధికం అవుతుంది. చేసే పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది.


డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. వృత్తి ఉద్యోగాదులలో తొందరపాటు పనికిరాదు. సేవకుల వలన అనుకూలత పెరుగుతుంది. సేవకులకోసం ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాల వల్ల ఒత్తిడి అధికం అవుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఉన్నత విద్యవలన కొంతశ్రమ అధికం అవుతుంది. పరిశోధకులకు అనుకున్న స్థాయిలో తమ పరిశోధనలు పూర్తి చేయలేరు. ప్రతీ విషయంలోనూ ఒత్తిడి అధికం అవుతుంది. చేసే పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత వహించడం మంచిది. ఆచి, తూచి అడుగులు వేయాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. తొందరపాటు వ్యవహారాలు పనికిరావు. నూతన పరిచయాల వల్ల మోసపోయే అవకాశం పెరుగుతుంది. సామాజిక అనుబంధాల్లో కొంత అప్రమత్తత అవసరం. భాగస్వాములు జాగ్రత్తగా మెలగాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం అధికం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆలోచన పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ అంశాలు తీర్చకునే అంశం గురించి ఆలోచిస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు అధికం అవుతాయి. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం అవసరం అవుతాయి. కళాకారులకు అనుకూలత అంతగా ఉండదు. ఆచి, తూచి వ్యవహరించాలి.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలకోసం అధికం ప్రయత్నం చేస్తారు. వాటివల్ల ఒత్తిడికి గురి అవుతారు. ప్రయాణాల వల్ల ప్రమాదాలు అధికం అవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలున్నాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సేవకజన సహకారం పెరుగుతుంది. సేవకులతో అనుకూలత పెరుగుతుంది. వారితో పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు కొంత ఒత్తిడికి గురి అయ్యే సూచనలు కనబడుతున్నాయి. తోటివారితో ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాటవల్ల అపార్థాలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వాలు పనకిరావు. కుటుంబ సంబంధాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం లభిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. బద్ధకం తగ్గించుకునే ప్రయత్నం అవసరం. అన్ని పనుల్లోను తట్టుకుని నిలబడాలి. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకటికి, రెండుసార్లు ఆలోచించి పనులు పూర్తి చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం అధికం అవుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చలు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. తొందరపాటు పనులు పనికిరావు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. లాభాలకోసం ఆరాటపడకుండా ఉండడం మంచిది. అన్ని పనుల్లో అనుకూలత పెంచుకోవాలి.

దిన ఫలితం 12.7.2020         డా. ఎస్‌. ప్రతిభ బుధ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) :సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నం అవసరం. సంతాన సంబంధ లోచనల్లో తొందరపాటు పనికిరాదు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : బంధువులు మిత్రులతో చాకచక్యంగా మాట్లాడుతారు. వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి.  కుటుంబ సంబంధాలు బలపడతాయి.  నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.  పనులు పూర్తి చేయడోంలో అధికంగా శ్రమ ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి.  ఏ పనుల్లోను తొందరపాటు పనికిరాదు.  వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) :.తమ చుట్టూ జనాలని తిప్పుకుంటారు. ఆనందకర వాతావరణం. విహార యాత్రలకై డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.  వ్యాపారస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి.  దాన ధర్మాలకై డబ్బు ఖర్చు చేయాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతోషకర వాతావరణం ఏర్పరుచుకుంటారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తాయి. వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలించే సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ఒత్తిడి అధికంగా ఉంటుంది.  శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన ఫలితం రాకపోవచ్చు. ఉద్యోగస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నం తప్పనిసరి. వ్యాపారాలలో అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి.  సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  విద్యార్థులకు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలు పూర్తి చేస్తారు. మంత్రజపాలు చేయడం మంచిది. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని కలిగిస్తాయి. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) పోటీలలో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలలో తొందరపాటు పనికిరాదు. శత్రువులపై విజయం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం అవసరం అవుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి.  తమపూ తమకు కొంత శ్రద్ధ పెరుగుతుంది. తమ గురించి తాము ఆలోచిస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యాపారస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రతువులపై విజయం సాధిస్తారు. తొందరపాటు పనికిరాదు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. గృహ నిర్మాణ పనులు వాయిదా వేయటం మంచిది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఆహారంలో వీరు సమయపాలన పాటించాలి. తీసుకునే ఆహారం ఆలోచించి తినాలి.  అన్ని పనుల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

click me!