ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఓ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంత వరకు తీరుస్తారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వీలైనంతవరకు వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. సన్నిహితులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు ఓ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కీలక పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు ధనలాభం పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్వల్ప రుణాలు కొంతవరకు తీరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో శుభకాలం. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులుంటాయి. వాహన సౌఖ్యం పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. తలపెట్టిన కార్యక్రమాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తోటి వారి సంతోషాన్ని పంచుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు నూతన వస్తులాభం ఉంటుంది. గృహం, వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఓ వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. సోదరులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చర్చాగోష్ఠుల్లో చురుకుగా పాల్గొంటారు. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కొన్ని విషయాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధువుల ద్వారా ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భూముల క్రయ, విక్రయాల్లో లాభాలు పొందుతారు. కార్యసిద్ధి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.