ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. సోదర వర్గీయుల సహకారం కోసం ప్రయత్నంచేస్తారు. అవి లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్స్ విషయంలో తొందరపాటు పనికిరాదు. దగ్గరివారు దూరమయ్యే అవకాశం. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. శ్రమతో పనుల సాధన చేస్తారు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : దూర ప్రయాణాల విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత నిదానం అవసరం. పరిశోధకులకు శ్రమ ఉంటుంది. సహకారం విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రమాదాలకు అవకాశం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు అవుతాయి. నిల్వధనం కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు వచ్చే సూచనలు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు పనికిరావు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాములతో వ్యవహరించే సమయంలో ఆచి, తూచి ప్రవర్తించాలి. శ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగవచ్చు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపుకై అధిక ప్రయతం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతి తక్కువౌవుంతి. పాదాల నొపలు ఏర్పడతాయి. విహార యాత్రలపై దృష్టి సారిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. సంతానం విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అవసరం. పెద్దల ఆశీస్సులకై అధిక ప్రయత్నం చేస్తారు. చివరకు లభిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వలన సంతోషం రాదు. సుఖం కోసం ఆరాట పడతారు. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. ఆహారం విషయంలో సమయానికి తీసుకోవాలి. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. తోటివారితో జాగ్రత్తగా మసలుకోవాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సోదర వర్గీయుల సహకారం కోసం ప్రయత్నంచేస్తారు. అవి లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్స్ విషయంలో తొందరపాటు పనికిరాదు. దగ్గరివారు దూరమయ్యే అవకాశం. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. శ్రమతో పనుల సాధన చేస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాటల్లో కాఠిన్యాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సంబంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం అవసరం. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. అనుకోని ఇబ్బందులు వస్తాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. శరీరానికి గాయాలయ్యే సూచనలు. అలసటకు గురౌతుంది. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాముల విషయంలో అతి ఆశ పనికిరాదు. నూతన పరిచయాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాదాల నొప్పులు వస్తాయి. పోటీల్లో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. ఆదర్శవంతమైన జీవితంకోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో సంతోషం ఏర్పరచుకుంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం విషయంలో కొంత నిరాశ ఏర్పడుతుంది. ఆచి, తూచి, నిర్ణయం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అప్రమత్తత అవసరం. అధికారిక ప్రయాణాలుంటాయి. తోటివారితో అనుకూలత పెరుగుతుంది. సౌకర్యాలు సంతోషాన్ని పూర్తిగా ఇవ్వలేవు. గృహనిర్మాణ పనులు ఒత్త్తిడి కలిగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.