today astrology: 22 ఫిబ్రవరి 2020 శనివారం రాశిఫలాలు

Published : Feb 22, 2020, 07:31 AM ISTUpdated : Feb 23, 2020, 08:25 AM IST
today astrology: 22 ఫిబ్రవరి 2020 శనివారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని కష్టాలు. శ్రమకు తగిన ఫలితాలకోసం ఎదురుచూపులు చూస్తారు. పరామర్శలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనులలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూర ప్రయాణాలపై ఆలోచన వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.  ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది.  విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని కష్టాలు. శ్రమకు తగిన ఫలితాలకోసం ఎదురుచూపులు చూస్తారు. పరామర్శలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనులలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపం ఏర్పడుతుంది. పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. భాగస్వామ్య వ్యాపారాలు ఒత్తిడికి గురి చేస్తాయి.  అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపుకై తపిస్తారు.  ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. పనులలో ఒత్తిడి అధికం అవుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ ఏర్పడవచ్చు. దానధర్మాలు అవసరం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతానం విషయంలో ఆలస్యం జరుగవచ్చు. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు.  క్రియేటివిటీ తగ్గుతుంది. ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తగ్గించుకునే ప్రయత్నం అవసరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి.  ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. ఊహించని ఇబ్బందులు వస్తాయి.  విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు.  ఆహారంలో సమయ పాలన మంచిది. నిరంతర జపం చేసుకోవడం అవసరం.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.  రచయితలకు అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. పనులలో తొందరపాటు పనికిరాదు. ప్రమాదాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి.  తొందరపాటు వ్యవహారాలు పనికిరావు. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  వాక్ చాతుర్యం తగ్గుతుంది. మధ్యవర్తి వ్యవహారాలు పనికిరావు.  మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు.  కుటుంబ సంబంధాల్లో లోటుపాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  నిల్వధనం కోల్పోయి సూచనలు ఉన్నాయి. దానధర్మాలు చేయడం మేలు. గృహ సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగవచ్చు. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. పట్టుదలతో పనులు చేయాలి. ప్రయత్నం తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతి అధికం కావాలి.  విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. శారీరక సౌఖ్యం తగ్గతుంది.  ఇతరులపై ఆధార పడతారు. దూర ప్రయాణాలపై దృష్టి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయాలి. 

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాట పడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలంటే గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరంతర భగవన్నామ స్మరణ తప్పనిసరిగా చేస్తూ ఉండాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంఘంలో కీర్తికోసం ఆరాట పడతారు.వ్యాపారస్తులకు తొందరపాటు పనికిరాదు. శ్రమకు తగిన ఫలితం కోసం ఎదురు చూపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు గౌరవం లభిస్తుంది.  ఉద్యోగ సంబంధ ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. 

PREV
click me!

Recommended Stories

2026 వృషభ రాశి ఫలితాలు ఇవిగో
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువ.. భరించడం చాలా కష్టం!