ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విహార యాత్రలకై డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడోంలో అధికంగా శ్రమ ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనుల్లోను తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : : విహార యాత్రలకై డబ్బు ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. దాన ధర్మాలకై డబ్బు ఖర్చు చేయాలి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తాయి. వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలించే సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నం తప్పనిసరి. వ్యాపారాలలో అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలు పూర్తి చేస్తారు. మంత్రజపాలు చేయడం మంచిది. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని కలిగిస్తాయి. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. గృహ నిర్మాణ పనులు వాయిదా వేయటం మంచిది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఆహారంలో వీరు సమయపాలన పాటించాలి. తీసుకునే ఆహారం ఆలోచించి తినాలి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యాపారస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : : సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నం అవసరం. సంతాన సంబంధ లోచనల్లో తొందరపాటు పనికిరాదు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి. ఆచి, తూచి వ్యవహరించాలి
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వలన కొంత ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలించే అవకాశం. అనుకున్న పనుల పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూల వాతావరణం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.