today astrology: 30 ఏప్రిల్ 2020 గురువారం రాశిఫలాలు

By telugu news teamFirst Published Apr 30, 2020, 7:02 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది.  పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి.  సంతృప్తి లభిస్తుంది.

డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం పోరాటం చేస్తారు. గౌరవ హానిని తట్టుకోలేరు. కీర్తి ప్రతిస్టాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యాగంలో పెద్దవారికితో  తనకన్నా ఉన్నతులతో ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపాటు పనికి రాదు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక  అనుభందాలు పెరిగే సూచనలు. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండడం మంచిది.  భాగస్వామ్య అనుభందాలు విస్తరించే అవకాశం. పెద్దవారితో పరిచయాలు పెరిగే అవకాశం. ఆచ్చి తూచి అడుగులు వేయాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకు ప్రయత్నం చేస్తారు. ఋణ సంభంద ఆలోచనలు పెరుగుతాయి. పెద్దవారితో పోటీ పెరిగే అవకాశం. రోఘానిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుల వారు దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు. శ్రమకు తగిన ఫలితం కోసం ఆలోచిస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక బద్ద జీవితం కోసం ఆలోచిస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. గృహనిర్మాణ పనులలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. మాతృ సౌకర్యం తక్కువ అయ్యే సూచనలు. విద్యార్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆహారం తీసుకునే విశయంలో కొంత తొందరపాటు పనికి రాదు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  కమునికేషన్స్ విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవసరం అవుతాయి. పెద్దలతో సమయం గడిపే అవకాశం. రచనలంటే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్తులకు అనుకూల సమయం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంభంలో అనుకూలత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. పెద్దలతో మాట మాట కలుపుతారు. నిల్వ ధనం పెంచుకునే ఆలోచనలు చేస్తారు. కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబంతో అనుభందం పెరుగుతుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది.  పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి.  సంతృప్తి లభిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి కోసం ఆలోచిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. ఆధాత్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో సంతృప్తి లభిస్తుంది. దానధర్మాలకోసం అధిక దానం వెచ్చిస్తారు. దేవాలయాలు విద్యార్తులకు పుస్కలు, అవసర వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్నీ పనులలో లాభాలు సాధించే ప్రయత్నం చేస్తారు.  పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి.

click me!