ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఇంట్రక్ బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు సోదరుల నుండి శుభవర్తమానాలు అందుతాయి ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంట బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగామిస్తారు. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన విషయాలు పై దృష్టి సారిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు నూతన పనులకు శ్రీకారం చూడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనాలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.