today astrology: 21జనవరి 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jan 21, 2020, 7:29 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.  ఈ రోజు చేసే పనులలో తొందరపాటు పనికిరాదు.  ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఆలోచించాలి.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగస్తులకు కొంత ఒత్తడి ఏర్పడుతుంది. శ్రమ అనంతరం ఆనందకర ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనికిరాదు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.  ఈ రోజు చేసే పనులలో తొందరపాటు పనికిరాదు.  ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఆలోచించాలి.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శ్రమ లేని సంపాదనపై దృష్టి పోతుంది. ఆకస్మిక లాభాలు వచ్చే సూచనలు. వ్యాపారస్తులు మోసపోకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పరామర్శలు చేస్తారు. చెడు సాహవాసాలు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పాత మిత్రులు కలిసే అవకాశం. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. వీరికి అనుకూలమైన సమయం. భాగస్వాములతో కలిసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీలపై గెలుపు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  అహంకారం పెరిగే సూచనలు.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మొండితనం అధికం అవుతుంది. ఊహించని ఆనందం లభిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడితో బాధపడతారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి.  సృజనాత్మకత కొంత తగ్గతుంది. జపం ఎక్కువగా చేసుకోవాలి. సంతానం వల్ల కొంత చికాకులు ఏర్పడే సూచనలు.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. గృహసంబంధ పనుల్లో ఆటంకాలు వచ్చే సూచనలు. ప్రయాణాల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆహారంలో సమయ పాలన మంచిది.  తినేవిషయంలో తొందరపాటు పడకూడదు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  కమ్యూనికేషన్స్ వల్ల అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి.  వినడం ద్వారా వచ్చే నాలెడ్జ్ పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. విద్యార్థులకు కొంత ఒత్తిడితో కూడిన సమయం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. అలంకరణపై దృష్టి సారిస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. కృషి శీలత పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విహార యాత్రలపై దృష్టి సారిస్తారు.  అనసవర ఖర్చులు చేస్తారు. విందు, వినోదాలవైపు ఆలోచన వెళుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ద్వారా ఆదాయం వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడి పనులు పూర్తిచేస్తారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.

click me!