today astrology: 14 జనవరి 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jan 14, 2020, 7:32 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి సారిస్తారుఉద్యోగస్తులు తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆనందకర వాతావరణం ఉంటుంది.


డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

Latest Videos

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి సారిస్తారు.  ఉద్యోగస్తులు తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆనందకర వాతావరణం ఉంటుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అన్ని పనుల్లోను సంతృప్తి లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఉన్నత విద్యలకై ఆసక్తి పెంచుకుంటారు. పరిశోధనలను పూర్తి చేస్తారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి పోటీ ఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం. ఆడవారితో అనుకూలత పెరుగుతుంది. ఆడవారి సహకారం పెరుగుతుంది. సుఖ వ్యాధులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంత శ్రమ ఉన్నా పనులను లెక్కచేయరు. పోటీలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. గృహ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం. ప్రణాళికలను అనుకూలమైన సమయం లభించకపోవచ్చు. తాము ఆలోచించింది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది. బంధువర్గీయులతో అనుకూలత పెంచుకుంటారు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  గృహ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరుగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. మాతృవర్గీయులతో అనుబంధాల్లో జాగ్రత్త అవసరం.  సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : : సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేస్తారు. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా శ్రమ పెరుగుతుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు కేసులు లాంటి వాటిలో వచ్చే ఆదాయాలు. విలువైన వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో కొంత ఒత్తిడి వచ్చే సూచనలు. చాకచక్యంతో పనులు పూర్తి చేసుకుంటారు.  మాట విలువ పెంచుకునే ప్రయత్నం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శరీరంపై ఆలోచన పెరుగుతుంది. అందంకోసం ఆలోచిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం ఏర్పడవచ్చు. తమకోసం తాము సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తారు.  సమయం, ధనం వృథా కాకుండా చూసుకోవాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన జీవితం కోసం ఆరాటపడతారు. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.

click me!