ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వైద్య శాలల సందర్శనం ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అన్ని రకాల ఆదాయాలపై దృష్టి సారిస్తారు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత అధిక శ్రమ అవసరం అవుతుంది. అన్ని పనులలోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వైద్య శాలల సందర్శనం ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అన్ని రకాల ఆదాయాలపై దృష్టి సారిస్తారు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన చేస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక కొరత ఏదో రూపంలో తీరుతుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీలలో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఎవరో ఒకరు ఏదో రూపంలో బహుమతులు అందజేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. తమకై తమకు శ్రద్ధ పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతాన సంబంధ ఆలోచనల్లో కొంత ఒత్తిడి అధికం అవుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. దైవకార్యాలలో అధికంగా సమయాన్ని కేటాయించాలి. ధనాన్ని వాటికోసం కేటాయించాలి. ఒత్తిడి తగ్గించుకునే ఆలోచన మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు కావాలనే ఆలోచన పెరుగుతుంది. వాటికోసం అధిక ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలలో ఒత్తిడి పెరుగుతుంది. అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచన చేస్తారు. గృహ నిర్మాణం కోసం చేసే పనులలో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్త అవసరం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. పరక్రమంతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయంకోసం ఆరాటపడతారు. కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ప్రయత్నం. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు కొంత కష్టసమయంగా చెప్పవచ్చు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం కోసం ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అన్ని పనులలోనూ సంతృప్తి లభిస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికం అవుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు పనులు, నిర్ణయాలు పనికిరావు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం ఉంటుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు వస్తాయి. విహార యాత్రలు చేయాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. దానధర్మాలకై డబ్బును ఖర్చు చేయడం మంచింది. ఇతరులకోసం ఆదాయాన్ని ఖర్చు చేసే సందర్భంలో ఒకసారి ఆలోచించాలి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. వచ్చిన లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లాభాలపై ఆలోచన ఎక్కువ అవుతుంది. అన్ని పనులలో సంతోషంగా కాలం గడుపుతారు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సాంఘిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ సంబంధ ఒత్తిడి అధికం అవుతుంది. తోటి వారితో కలిసి మెలిసి ఉండేలా ప్రయత్నం చేయాలి. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.