31ఆగస్టు 2019 శనివారం రాశిఫలాలు

By telugu teamFirst Published Aug 31, 2019, 6:47 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి వారు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తల్లితో సౌఖ్య లోపం ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఏర్పడుతుంది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చికాకు పడతారు. సంతానం వల్ల సమస్యలు ఎక్కువౌతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. పనుల్లో ఆసక్తి లోపిస్తుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తల్లితో సౌఖ్య లోపం ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ, క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.  

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : బయటివారి సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రసార, ప్రచార సాధనాల్లో అనుకూలత ఉంటుంది. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. మాటల్లో జాగ్రత్త అవసరం. నిల్వధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. కంటి సంబంధ లోపాలకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తొందరగా నీరస పడిపోతారు.పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంటా యి. మానసికంగా కూడా కృంగిపోతారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనవసర ఖర్చులు చేస్తారు. వ్యతిరేక భావన పెరుగుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విహార యాత్రలకై ప్రయత్నిస్తారు. పరాధీనత ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికమౌతుంది. ూందులు వినోదాల్లో పాల్గొటా ంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఇతరులపై ఆధారపడతారు. కళానైపుణ్యం తగ్గుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తిచేయాలనే ఆలోచన ఉంటుంది. సమిష్టి ఆదాయలకోసం ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటా యి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అధికారులతో జాగ్రత్త అవసరం. చేసే పనిలో నిరాశ, నిస్పృహలు ఉంటా యి. వృత్తి ఉద్యోగాదుల్లో అసౌకర్యం.  ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు, పరువుకోసం పనిచేస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలవైపు దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి పెరుగుతుంది.  సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకై ప్రయత్నం చేస్తారు. వైద్యశాలలసందర్శనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో నిరాశ ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. స్నేహితులతో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. పలుకుబడికోసం ఆరాటం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తారు. విఫలమైనా ధైర్యాన్ని కోల్పోరాదు.  శత్రువులపై విజయం కోసం ఆరాటపడతారు. ఋణాలపై దృష్టి ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. సేవకులు అనుకూలంగా ఉంటా రు. ఔషధ సేవనం తప్పనిసరి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం  మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!