ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సహకారం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడితో ఉంటారు. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతాన సమస్యలు ఉంటాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత తక్కువ ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : గృహ సౌక్యం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీల్లో గెలుపుకై ప్రయత్న సాధన. ఆహారం సమయానికి అందుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సహకారం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడితో ఉంటారు. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాగ్దానాలు అనుకూలిస్తాయి. పనుల్లో సంతోషం లభిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ఆలోచన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికం. తాను చేసే పనుల వల్ల తనకు ఇబ్బంది ఏర్పడుతుంది. పనుల్లో ఒత్తిడి అధికం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు అవసరం. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. అనవసర ఇబ్బందులు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు ఏర్పడతాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. విహార యాత్రలు చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విశ్రాంతిలోపం ఉంటుంది.. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వ్యాపార అభివృద్ధి, లాభాలు సూచితం. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : చేసే వృత్తిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. తోటి అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆలోచిస్తారు. అన్నిరకాల సంతోషాలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పెద్దలతో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. అనవసర ఖర్చులు ఉంటాయి. పరిశోధకులు జాగ్రత్తగా ఉండాలి. దూరదృష్టి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఊహించని సంతోషాలు. అనుకోని ఆనందాలు ఉంటాయి. శ్రమలేని ఆదాయం వస్తుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరాధీనత ఉంటుంది. అవయవలోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. పోటీల్లో గెలుపు ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో మార్పులు కనిపిస్తాయి. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ