26 ఆగస్టు 2018 ఆదివారం మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published 26, Aug 2018, 8:41 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది. పనుల్లో పట్టుదల అవసరం. గౌరవం కోసం ఆరాటం. తల్లికి దూరంగా ఉంటారు. సౌకర్యాల విషయంలో ఒత్తిడి ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఆహారం స్వీకరించరాదు. విద్యలో ఆటంకాలు ఉంటా యి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్యుల సహాయసహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలంగా ఉంటా యి. పరామర్శలు చేస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని కష్టాలు వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. మాటల వల్ల తొందరపాటు పనికిరాదు. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు ఉంటా యి. గుర్తింపుకోసం ఆరాటం ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఉంటుంది. ప్రణాళికల్లో లోపాలు ఉంటా యి. పట్టుదల, ప్రయత్నం చాలా అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పోటీ ల్లో నిలబడే తత్త్వం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి.  ఇడ్లీ, వడ దానం చేయడం మంచిది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. కొంత శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశలు వస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : గృహ సంబంధ సమస్యలు పెరుగుతాయి. సౌకర్యాలు కోల్పోతారు. అధికారులతో అప్రమత్తత అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటా యి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలకై ఆలోచిస్తారు. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది.రాజకీయ న్యాయ విషయాలపై దృష్టి ఉంటుంది. దూర దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాటల్లో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో అలజడి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఇబ్బందులు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు చోటు చేసుకుంటాయి .   శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాల వల్ల పనుల్లో ఆటంకాలు ఉంటా యి. పలుకుబడికోసం ఆరాట పడతారు. లభించక పోతే విచారిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పాదాల సంబంధ నొప్పులు అనుకోని ఖర్చులు. అనవసర ఇబ్బందలు ఉంటా యి. పోటీల్లో ఎదుర్కోవడానికి కష్టపడాలి. శత్రువులతో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. దురాశ వల్ల ఇబ్బందులు.  మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటా యి. సృజనాత్మకతను కోల్పోతారు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ప్రతిభ

 

ఇవి కూాడా చదవండి

ఈ వారం( 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

Last Updated 9, Sep 2018, 11:08 AM IST