ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సౌకర్యాల వల్ల కొంత శ్రమ ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆహారం సమయానికి తీసుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమతో పనులు పూర్తిచేస్తారు. పోటీలు ఒత్తిడులు ఉన్నా చికాకులు తప్పవు. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. ఋణాల కోసం ఆలోచనలు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. వ్యతిరేక ప్రభావాలపై కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే పనుల్లో ఉంటారు.
undefined
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సౌకర్యాల వల్ల కొంత శ్రమ ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆహారం సమయానికి తీసుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృవర్గీయుల సహకారం కోసం ప్రయత్నం చేస్తారు. లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు కొంత శ్రమ ఉన్నా ఫలితం సాధిస్తారు. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం లభిస్తుంది. లపోహలకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాగ్దానాల వల్ల కొంత శ్రమ ఏర్పడుతుంది. దీని వలన నిల్వ ధనాన్ని కోల్పోతారు. కుటుంబ సబంధాలు దూరమయ్యే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాటల్లో తొందరపాటు పనికిరాదు. మౌనంగా ఉండడం మేలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమను తట్టుకుని నిలబడే ప్రయత్నం చేయాలి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడంలో కొంత ప్లానింగ్ చేసుకోవాలి. అనవసర ఒత్తిడులు దగ్గరికి రాకుండా చూసుకోవాలి. కార్యనిర్వహణ దక్షతను పెంచుకునే ప్రయత్నం చేయాలి.
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిత్యావసరాల కోసం వెచ్చిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో ముందు జాగ్రత్త అవసరం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలపై దృష్టి సారిస్తారు.
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపారంలో అనుకూలత తగ్గుతుంది. లాభాలు ఉన్నా అశించిన ప్రయోజనాలు సిద్ధించవు. వేరు వేరు ప్రయోజనాలను ఆశిస్తారు. పెద్ద వారితో కొంత అనుకూలత ఏర్పడుతుంది. తొందరపాటు పనికిరాదు. వేరు వేరు ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. ఆలోచనలను ఫలిస్తాయి.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత కోసం ప్రయత్నిస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఒత్తిడి అధికం అవుతుంది. విద్యార్థులు శ్రమకు లోనవుతారు. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యలపై శ్రమ అధికం అవుతుంది.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని సమస్యలు తలెత్తే సూచనలు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని కష్టాలు వస్తాయి. శ్రమ రహిత సంపాదనపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారస్తులకు దానధర్మాలు అధికం చేయాలి.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. నూతన పరిచయస్తులతో అనుకోని ఇబ్బందులు. భాగస్వామ్య వ్యవహరాల్లో తెలియని సమస్యలు వస్తాయి. కాంట్రాక్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే సూచనలు. కొత్త పనులపై దృష్టి సారిస్తారు.
డా.ఎస్.ప్రతిభ