23ఏప్రిల్ 2019 మంగళవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Apr 23, 2019, 6:42 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ఖర్చులు చేస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం.  విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. పరాధీనత ఉంటుంది. రహస్య స్థావరాలపై దృష్టి పెడతారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతోషం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సమిష్టి ఆశయాలు నెరవేరుస్తారు. సమిష్టి ఆదాయాలు వస్తాయి. అన్ని పనుల్లో ఆనందం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : చేసే వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వృత్తులలో అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సహకారం లభిస్తుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. కీర్తిప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆహారంపై దృష్టి తగ్గించుకోవాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. దూరదృష్టివల్ల ఇబ్బందులు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రమలేని సంపాదన ఉంటుంది. అనుకోని ఖర్చులు చేస్తారు. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకు దృష్టి ఉంటుంది. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆచి, తూచి వ్యవహరించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనుబంధాలలో అనుకూలత ఉంటుంది. నూతన పరిచయాల వల్ల సంతోషం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం.భాగస్వాములతో కలిసి వస్తుంది. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణబాధలు తీరే ప్రయత్నంచేస్తారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వృత్తి విద్యల్లో అనుకూలత ఏర్పడతాయి. నష్టవస్తువులను పొందే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో అలజడి ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయత తక్కువౌవుతంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. విద్యార్థులకు కష్టకాలం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర శ్రమ ఉంటుంది. ఆహారంలో సమయపాలన అవసరం. పదిమందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాలలో సంతృప్తి లభిస్తుంది. దగ్గరి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది.  సహకారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పనుల్లో కార్యసాధన. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడతుంది. కిం సంబంధ దోషాలు తొలగుతాయి.   వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపు లభించదు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. వాటికి అనుగుణంగా ప్రణాళికలను మార్చుకునే ప్రయత్నం.  కష్టసుఖాలు సమానంగా ఉంటాయి. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. మంచి కృషిశీలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!