20 నవంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

Published : Nov 20, 2019, 07:16 AM IST
20 నవంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి

మేషం : వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

వృషభం : ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

మిథునం : సామాజిక  అనుభందాలు పెరిగే సూచనలు. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండడం మంచిది.  భాగస్వామ్య అనుభందాలు విస్తరించే అవకాశం. పెద్దవారితో పరిచయాలు పెరిగే అవకాశం. ఆచ్చి తూచి అడుగులు వేయాలి.

కర్కాటకం : పోటీల్లో గెలుపుకు ప్రయత్నం చేస్తారు. ఋణ సంభంద ఆలోచనలు పెరుగుతాయి. పెద్దవారితో పోటీ పెరిగే అవకాశం. రోఘానిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుల వారు దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు. శ్రమకు తగిన ఫలితం కోసం ఆలోచిస్తారు.

సింహం : సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక బద్ద జీవితం కోసం ఆలోచిస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

కన్య : సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. గృహనిర్మాణ పనులలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. మాతృ సౌకర్యం తక్కువ అయ్యే సూచనలు. విద్యార్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆహారం తీసుకునే విశయంలో కొంత తొందరపాటు పనికి రాదు.

తుల : కమునికేషన్స్ విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవసరం అవుతాయి. పెద్దలతో సమయం గడిపే అవకాశం. రచనలంటే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్తులకు అనుకూల సమయం.

వృశికం : వాక్దానాలు నెరవేరుతాయి. కుటుంభంలో అనుకూలత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. పెద్దలతో మాట మాట కలుపుతారు. నిల్వ ధనం పెంచుకునే ఆలోచనలు చేస్తారు. కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబంతో అనుభందం పెరుగుతుంది.

ధనుస్సు : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది.  పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి.  సంతృప్తి లభిస్తుంది.

మకరం : విశ్రాంతి కోసం ఆలోచిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. ఆధాత్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో సంతృప్తి లభిస్తుంది. దానధర్మాలకోసం అధిక దానం వెచ్చిస్తారు. దేవాలయాలు విద్యార్తులకు పుస్కలు, అవసర వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం : అన్నీ పనులలో లాభాలు సాధించే ప్రయత్నం చేస్తారు.  పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి.

మీనం : సంఘంలో గౌరవం కోసం పోరాటం చేస్తారు. గౌరవ హానిని తట్టుకోలేరు. కీర్తి ప్రతిస్టాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యాగంలో పెద్దవారికితో ఆన్గా తనకన్నా ఉన్నతులతో ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపాటు పనికి రాదు.

 

PREV
click me!

Recommended Stories

Tarot Horoscope: ఈ రాశి వారికి ఫిబ్ర‌వ‌రి చాలా ప్ర‌త్యేకం.. ఆరోగ్యం విష‌యంలో మాత్రం
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అనుకూల ఫలితాలు!