18జనవరి2019శుక్రవారం రాశిఫలాలు

Published : Jan 18, 2019, 07:18 AM IST
18జనవరి2019శుక్రవారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నిల్వధనాలు కోల్పోతారు. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. కిం సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. మాట విలువ తగ్గుతుంది అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ఒత్తిడితో కూడిన ప్రయాణాలు చేస్తారు. లలితాపారాయణ చేయడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొటాంరు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. సోదరుల ద్వారా ఆదాయం వచ్చే సూచన. ఆదర్శవంతమైన జీవితానికి ప్రయత్నం చేస్తారు. ఆశయాలు సమిష్టిగా ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిత్యావసర ఖర్చులు అధికంగా ఉంటాయి. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. ద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరట పడతారు. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. చేసే వృత్తులు ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామజపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. స్త్రీల ద్వారా ఆదాయం వచ్చే సూచన. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు.  శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రకాల సౌఖ్యం లభిస్తుంది. ఊహించని ఇబ్బందులు పడతారు. అనుకోని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు ఆస్తాకరం. చెడు సాహవాసాలు పెరుగుతాయి.  శ్రీ రాజమాతంగ్యై నమః

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో భయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.  సామాజిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లోపాలు ఉంటాయి. భాగస్వామ్య అనుబంధాలు తగ్గుతాయి. లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనారోగ్య భయం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ బాధించదు. ఆనందంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి అధికం.పోటీల్లో గెలుపు ఉంటుంది.  లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నష్టవస్తు పరిజ్ఞానం లభిస్తుంది. భాగస్వామ్య అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిపాలన సమర్ధత అధికంగా ఉంటుంది. కళలపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి కావు. ఆలోచనల్లో వైవిధ్యం శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. ఋణాల వల్ల సంతోషం కలుగుతుంది. వృత్తి విద్యల్లో ఆనందం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. తల్లికి దూరంగా నివసించే ఆలోచన ఉంటుంది.. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సృజనాత్మక తగ్గుతుంది. పరిపాలన సమర్ధత ఉండదు. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు.  తోటివారి సహాయ సహకారాలుటాంయి. సోదరుల సహకారాలు ఉంటాయి  లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఆటంకాలు కలుగుతాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. మాటల వల్ల జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు వస్తాయి. ప్లోటాటల జోలికి పోరాదు. కుటుంబంలో జాగ్రత్త వహించాలి. లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల వల్ల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆలోచన ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది.  శారీరక శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి అధికం. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. కష్టకాలం అధికం లలితాసహస్రనామ పారాయణం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Guru Shani Samyogam: గురు శని సంయోగంతో ఈ 4 రాశులవారికి చేతి నిండుగా డబ్బు
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది!