ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు సమాజంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అందరితో కలిసి మెలసి తిరిగే తత్వం అలవడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పరస్పర సహకారం లభిస్తుంది. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర కష్టాలు ఎదుర్కొటాంరు. పనుల్లో తొందరపాటు ఉంటుంది. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఒత్తిడితో కూడిన సమయం. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సమాజంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అందరితో కలిసి మెలసి తిరిగే తత్వం అలవడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పరస్పర సహకారం లభిస్తుంది. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. వృత్తి విద్యల కోసం ఎక్కువ కష్టం ఉంటుంది. అనవసర పనుల్లో జాప్యం ఉంటుంది. అన్ని సమస్యలు ఒకే సారి రావడం, వాిని సాధించుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాల సాధన ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానం విషయంలో సంతోషం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. శ్రీమాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహారంలో సమయ పాలన అవసరం. విందు భోజనాల వైపు దృష్టి తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులు అయ్యే సూచనలు. తల్లి తరుఫు వారితో కొంత జాగ్రత్తగా మెలగాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పరాక్రమం పెంచుకునే ప్రయత్నం. సహకారం కోసం ఎదురు చూపులు ఉంటాయి. ప్రచార, ప్రసార సాధనాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నృసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వ ధనం పెరుగుతుంది. ఆభరణాలపై ఆలోచనలు ఉంటాయి. వాగ్దానాలు నెరవేరుస్తారు. మధ్యవర్తిత్వాలు ఉపకరిస్తాయి. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. సంతోషకర వాతావరణం ఉంటుంది. అన్ని పనుల్లో సంతోషం, సంతృప్తి లభిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉద్యోగంలో టాన్స్‌ఫర్స్ అయ్యే సూచనలు. ఉన్నతమైన పదవులకోసం శ్రమ పడతారు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. అనుకున్నంత సాధించలేరు. ఆలోచనలకు అనుగుణంగా పనుల్లో మార్పుల చేసుకోవాలి. పట్టుదలతో కార్యసాధన చేయాలి. చిత్త చాంచల్యం అవసరం. శ్రీదత్త శ్శరణం మమ జపం ఉపకరిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతి లోపం ఉంటుంది. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. పాదాల నొప్పులు సూచితం. పరాధీనత ఉంటుంది. సుఖం కోసం ఆరాటపడతుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అన్ని విధాల లాభాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆదాయాలు నెరవేరుతాయి. కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉంటాయి. సాత్విక ఉపాసనపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఇతరులపై ఆధారపడతారు. రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. కార్యసాధనలో పట్టుదల అవసరం. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. చేసే ఉద్యోగంలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడంమంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పరిశోధకులకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సజ్జన సాంగత్యం పెరుగుతుంది. దూర దృష్టి ఉంటుంది. పెద్దల ద్వారా తెలుసుకోగోరే మంచి విషయాలు తెలుస్తాయి. విశాల భావాలు అలవడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ