ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు శత్రువులపై విజయ సాధనకు ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. గౌరవ సంబంధ వృత్తి లభిస్తుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు తక్కువశ్రమతో ఫలితాలసాధన
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరస్పర సహకారాలు అనుకూలిస్తాయి. పరాక్రమం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచనలు. వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. క్రీం అచ్యుత్యానంత గోవింద శ్రీ మాత్రే నమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు ఉంటాయి. మధ్య వర్తిత్వాలు పనికిరావు. కుటుంబంలో ఒత్తిడితో కూడిన వాతావరణం.సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి శ్రీ దత్త శ్శరణం మమ జపం.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. ఊహించని కష్టాలు వచ్చే సూచనలు ఉంటాయి.పోటీ ల్లో అధిక శ్రమ ఉంటుంది. శత్రువుల విషయలో ఒత్తిడి అధికం. ఋణబాధలు పెరుగుతాయి. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనవసర ప్రయాణాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతాన సమస్యల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సృజనాత్మకతను పెంచుకుంటారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన మంచి చేస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల సహకారాలు తగ్గుతాయి. పరాక్రమం లోపిస్తుంది. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. ఒత్తిడితో సౌకర్యాల సాధన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్త్రలు అవసరం. ఆహారంలో సమయపాలన మంచిది. తేలికమైన ఆహారం స్వీకరించాలి. హనుమత్ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆత్మీయులు దూరమయ్యే సూచనలు. రాజకీయ విషయాలపై దృష్టి ఉంటుంది. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విదార్థులు ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాించాలి. శ్రీరామజయరామజయజయ రామరామ జపం
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ప్రయాణాలు చేస్తారు. అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. పరిశోధకులు జాగ్రత్త అవసరం. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. సుబ్రహ్మణ్యారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. చెడుసాహవాసం. ఉద్యోగస్థులకు స్థానమార్పు ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు అవసరం. కార్యసాధనలో పట్టుదల అవసరం. హనుమత్ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతి లోపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకై ప్రయత్నం అవసరం. దూర ప్రయాణాలపై దృష్టి పెరుగుతుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శత్రువులపై విజయ సాధనకు ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. గౌరవ సంబంధ వృత్తి లభిస్తుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు తక్కువశ్రమతో ఫలితాలసాధన. శ్రీహయగ్రీవాయనమః జపంమంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంతాన సమస్యలు అధికం అవుతాయి. విద్యార్థులకు అధిక ఒత్తిడితో తక్కువ ఫలితాలు సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమ ఉంటుంది. సంతోషం లభిస్తుంది. అన్ని పనుల్లో సంతృప్తిని అనుభవిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడి అనంతరం సంతోషం లభిస్తుంది.అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. అధికారులతో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం సూచిస్తుంది. హనుమత్ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.
డా.ఎస్.ప్రతిభ