16అక్టోబర్ 2018 మంగళవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Oct 16, 2018, 9:46 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సూచన ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో లపాలు ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. భాగస్వాములతో అననుకూలత ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎదుివారితో జాగ్రత్త అవసరం. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడికి దూరమౌతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులకు అనుకూల సమయం. సంతృప్తి లభిస్తుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : స్త్రీలద్వారా అనుకూలత ఏర్పడుతుంది. మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారం సమయానికి తీసుకుటాంరు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. సౌకర్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సూచనలు మెరుగుపడతాయి. సంతృప్తి లభిస్తుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్త్రీల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆస్తి, పాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తితో కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ తగ్గుతుంది. ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. పనులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుటారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనవసర వ్యయాలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలకు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొనొప్పులు ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. పనుల్లో సంతృప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారస్తులు సంతోషం లభిస్తుంది. పెద్దలతో అనుకూలత ఉంటుంది.  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లాభిస్తాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొటారు. మృష్టాన్నభోజనం లభిస్తుంది. దూర దృష్టి ఉంటుంది. పనుల్లో ఆనందం ఉంటుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. దూరదృష్టి ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది.  లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఉంటుంది.  శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన కనబడుతుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!