15అక్టోబర్ 2018 సోమవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Oct 15, 2018, 7:25 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఇబ్బందులకు పోరాదు. సంఘంలో గౌరవ మర్యాదలు హాని కలిగే ప్రయత్నం. కాలం దుర్వినియోగం అవుతుంది. అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో నిరాశ నిస్పృహలు వచ్చే సూచనలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆహారంలో సమయ పాలన అవసరం. కాలం దుర్వినియోగం అవుతుంది. అనుకున్న పనులు పూర్తికావు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.  జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు కష్టకాలం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. పనులలో జాప్యం ఉంటుంది. కాలం వృథా అవుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు. వైద్యశాలల సందర్శనం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన మంచిది. అనారోగ్య భావన ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేయాలనే తపన ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. అనవసర ఖర్చులు ఉంటాయి. పనుల్లో జాప్యం. రోగనిరోధశక్తిని పెంచుకునే ప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. చిత్త చాంచల్యంఅధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. అనవసర  ప్రయాసలు ఉంటాయి. ధనం దుర్వినియోగం అవుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలకోసం ఆరాటం పెరుగుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తనను తక్కువ చూస్తారనే భావన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారం స్వీకరణలో  సమయ పాలన పాించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సహకారలోపం ఏర్పడుతుంది. సహకారం వల్ల ఇబ్బందులు ఉంటాయి. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల లోపాలు ఉంటాయి. ప్రచార, ప్రసార సాధనాల్లో లోపాలు. విద్యార్థులకు ఒత్తిడి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కోల్పోతారు. నిల్వ ధనాన్ని కోల్పోతారు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. కంటి సంబంధ వ్యాధులు. అనుకోని ఇబ్బందులు, కష్టాలు వచ్చే సూచన. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. కష్టకాలం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పరాధీనత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకోని ఆపదలు వస్తాయి. సేవకుల ద్వారా ఆదాయం. సృజనాత్మకతను కోల్పోతారు. కళాకారులకు ఒత్తిడి సమయం. ఇతరులపై ఆధారపడతారు. దురాశ పెరుగుతుంది. నిరాశలు చోటుచేసుకుటాంయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!