13ఆగస్టు 2019 మంగళవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Aug 13, 2019, 6:52 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  చేసే అన్ని పనుల్లో అధిక శ్రమ ఏర్పడుతుంది. కాని శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపంమంచిది.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు చేయడంలో ఆలోచిస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. గృహ నిర్మాణాదుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆహారంలో సమయపాలన మంచిది. అనారోగ్య సూచనలు. ఆదిత్యహృదయ పారాయణ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. అధికారులతో సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం. విద్యార్థులకు కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. అన్ని పనుల్లో తొందరపాటు పనికిరాదు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాక్‌ధోరణిలో ఒత్తిడులు ఏర్పడతాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. కుటుంబ సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి.   కిం సంబంధ లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్యహృదయ పారాయణ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అన్ని పనుల్లో ఊహించని ఇబ్బందులు వస్తాయి. ఆలోచన ఒకరకంగా ఉంటుంది. పనులు ఇంకో రకంగా ఉంటాయి. ప్రణాళికలు అన్నీ వ్యర్థమౌతాయి.  చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. శివారాధన మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి అధికం అవుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పరామర్శలు వచ్చే సూచనలు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. దానధర్మాలు మంచివి. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల సమయం. కొన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా పెంచుకుంటారు. అనవసర పనుల జోలికి పోకూడదు. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో  అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికం అవుతుంది. చేసే పనుల్లో శ్రద్ధ అవసరం.సంఘంలో గౌరవం,పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతారు. కొంత తగ్గిపోయే అవకాశం. ఓం నమఃశివాయ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  విద్యార్థులకు ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. పరిశోధకులు తమ పరిశోధనలపై దృష్టి పెడతారు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఊహించని ఒత్తిడులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. కాని ప్రయాణాల్లో ఒత్తిడులు పెంచుకుంటారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమలేని ఆదాయానికి ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం అవసరం. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లోఒత్తిడి ఏర్పడుతుంది. చిత్త చాంచల్యం తగ్గుతుంది. భాగస్వాములతో అనుకువతో మెలగాలి. ఏ పని చేసినా ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సమస్యలు సావధానంగా పరిష్కరించుకోవాలి. ఆదిత్యహృదయ పారాయణ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : చేసే అన్ని పనుల్లో అధిక శ్రమ ఏర్పడుతుంది. కాని శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపంమంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతాన సమస్యలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో అనవసరంగా మ్లాడకూడదు. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరంతర భగన్నామ స్మరణ మంచిది. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

click me!