ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరిక శ్రమ ఉంటుంది. నరాల నొప్పులు వచ్చే సూచనలు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికాబద్ధకంగా కార్యం రూపం దాలుస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం చేయడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వివ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. విజ్ఞాన యాత్రలు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. దానధర్మాలు అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. పెద్దలతో వివాదాలు తగవు. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులు అనుకూల సమయం అవుతుంది. బాగా అభివృద్ధిచెందుతారు. అన్నిపనుల్లో అనుకూలత ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గౌరవాన్ని కాపాడుకుంటారు. చేసే పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. పనుల్లో సంతృప్తి కొంతవరకు లభిస్తుంది. ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. విజ్ఞాన యాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసనం. అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు అన్నిలోనూ అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరించే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. పెట్టుబడులకోసం ప్రయత్నం అధికం. నూతన పరిచయస్తులతో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణభారం తగ్గుతుంది. శ్రమానంతర ఫలితాలు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల సమయంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతాన సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగిస్తాయి. సంతానం కోసం ఆలోచన పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. పనుల్లో జాప్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఆలోచనలు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. గృహంపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపం అవసరం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. విద్యార్థులు ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అనుకూలం అవుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మాటల వల్ల గౌరవం పెంచుకుంటారు. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పదుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థికావసరాలు సంపూర్తిగా తీరుతాయి. ఆనందకరవాతావరణం ఉంటుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.
డా.ఎస్.ప్రతిభ