ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. కొత్త ప్రణాళికలు ఫలిస్తాయి. సంతానవర్గంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు, ప్రయాణాలకు అనుకూలం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. విందులు విహారాలకోసం సమయం వెచ్చిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. శారీరక ఒత్తిడులు ఉంటాయి. సౌకర్యాలపై దృష్టి పెడతారు. సోదరవర్గ సహకారం లభిస్తుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆహార విహారాదులపై దృష్టి ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలు ప్రభావితం చేస్తాయి. విద్యారంగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభపరిణామాలకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. అపోహలు కూడదు. భాగస్వామ్యాల్లో అందరి సహాయ సహకారాలుటాంయి. సంతానంవ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. మంచి వార్తలు వింరు. అధికారిక గుర్తింపు లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంఆయి. అనేక రూపాల్లో ప్రయోజనాలుటాంయి. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. నిరాశపడకూడదు. స్త్రీల వల్ల లాభాలుటాంయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం ఉంటాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలపై అనుకూలత ఏర్పడుతుంది. నిర్ణయాదుల్లో అనిశ్చితి ఏర్పడుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : కుటుంబంలో మంచి నిర్ణయాలుటాంయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. అ నుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. కాని అధికమైన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. పోటీ రంగంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి గుర్తింపుకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులు ఉంటాయి. శుభవార్తలు వింరు. సోదరవర్గ సహకారం. ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు అనేకంగా ఉంటాయి. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. వ్యవహార విజయం అవసరం. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆలోచనలు అనేకంగా ఉంటాయి. సంతానం వల్ల కొంత నిరాశ ఏర్పడే అవకాశం. సుదూర ప్రయాణాదుల కోసం ప్రయత్నిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాత్మక స్థితిని పోషిస్తాయి. కుటుంబం అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఖర్చులు తప్పకపోవచ్చు. పెట్టుబడులు వేరు వేరు రూపాల్లో ప్టోల్సి వస్తుంది. ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరామర్శలు ఉంటాయి. సౌకర్య లోపాలుటాంయి. ఆహార విహారాల్లో ఇబ్బందులుఉంటాయి. అనుకోని సమస్యలు ఏర్పడతాయి. మానసిక శారీరక ఒత్తిడులు ఉంటాయి. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. లాభాలపై మనసు పెడతారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అనుగ్రహం లభిస్తుంది. లాభాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఫలిస్తాయి. వేరువేరు పనులకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సహకారం ఆశించినంతగా లభించదు. కొంత నిరాశ ఏర్పడుతుంది. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకోసం పెట్టుబడుటు పెడతారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వృత్తిలో ఉన్నతి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. అధికారిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. బాధ్యతలు అధికంగా ఉంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాల్లో నైరాశ్యం చోటుచేసుకుంటుంది. శ్రమతో వ్యవహారాలన్నిలోనూ విజయం సాధిస్తారు. అన్ని పనుల్లోనూ లాభాలు ప్రభావితం చేస్తారు. వ్యాపారాదుల్లో మరింత అనుకూలత ఏర్పడుతుంది. సంతానంపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఉన్నత వ్యవహారాలపైదృష్టి పెడతారు. కీర్తిప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దైవానుగ్రహం లభిస్తుంది. సుదూర ప్రయాణాలకోసం ప్రణాళికలు వేస్తారు. విద్యారంగంలో ఉన్నతి ఉంటుంఇ. సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాదులన్నీ ఫలించకపోవచ్చు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతోషంతో కాలం గడుపుతారు. కొత్త పనులనిర్వహణ ఉంటుంది. క్రియేివిటీ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలత పెరుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది.శ్రీమాత్రేనమః
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఏవో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అధికారిక సమస్యలు కూడా ఉంటాయి. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. అనారోగ్య భావనలు ఉంటాయి. నిర్ణయాదుల్లో లోపాలు ఉంటాయి. వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూల సమయం. సౌకర్యాదులు, సౌఖ్యంపై దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కాని అప్రమత్తంగా ఉండాలి. సమున్నతమైన భావనలుటాంయి. కార్యక్రమాలను సులువుగా నిర్వహిస్తారు. దైవానుగ్రహం లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాలన్నింలోనూ అనుకూలత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణావకాశాలు ఉంటాయి. ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక సంబంధమైన అంశాలను ఆలోచించాల్సి వస్తుంది. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. కొంత నిరాశ ఉంటుంది. సంప్రదింపులకు అవకాశం ఏర్పడుతుంది. స్త్రీవర్గ సహకారం లభిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. దైవ కార్యక్రమాల వల్ల మేలు కలుగుతుంది. పోటీ ల్లో ఇబ్బందులుటాంయి. గుర్తింపు తగ్గవచ్చు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఋణాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. చమత్కార ధోరణి పెరుగుతుంది. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక నిల్వలలు పెంచుకుంటారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సౌకర్యాలపై దృష్టి ఉన్నా ఆశించిన సంతోషం ఉండదు. తొందరపాటు పనికిరాదు. శ్రీమాత్రే నమః జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ