11 సెప్టెంబర్ 2018 మంగ‌ళ‌వారం మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published 11, Sep 2018, 9:22 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం తప్పదు. శతృవులపై విజయానికి  ఆటంకాలు ఉంటాయి. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి.  మానసిక ఒత్తిడి అధికం. అనుకున్న పనులు పూర్తికావు. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక సంతృప్తి ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన ఆలోచనల్లో సమస్యలు వస్తాయి. విద్యార్థులకు కొంత ఆటంకాలతో ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృసౌఖ్య లోపం ఉంటుంది. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో ఆలస్యం ఉంటుంది.  సౌకర్యాల వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : స్త్రీల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి.  ఒత్తిడితో ప్రయాణాలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యం ఎక్కువ. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి బంధువులతో అనుకూలత ఉంటుంది. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాగ్దానాల వల్ల ఒత్తిడులు. మాట విలువ తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. నిల్వధనం కోల్పోయే ప్రమాదం. కిం సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పనుల్లో ప్రణాళికలు అవసరం. శ్రమాధిక్యం. గుర్తింపుకోసం ఆరాటం. ఆలోచనల్లో మార్పులు. పట్టుదలతో కార్యసాధన అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. కష్టపడే తత్వం ఉంటుంది. అభిరుచుల్లో మార్పులు ఉంటాయి. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం. పాదాల నొప్పులు. విజ్ఞాన యాత్రలకై తపన. ప్రయాణాలపై దృష్టి అధికం. పరాశ్రయం.  సుఖం కోసం ఆలోచించడం. అనవసర ఇబ్బందులు. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీల ద్వారాఆదాయానికి అనుకూలత. సమిష్టి ఆదాయాలు లభించే సూచన. సంఘవ్యవహారాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. కళలపై ఆసక్తి. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవంకోసం ఆరాటం. చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికం. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అధికారిక పనులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఔషధ స్వీకరణ. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి. అధికారులతో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం. దూర దృష్టి వలన అనవసర ఇబ్బందులు. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆరోగ్య సమస్యలు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. క్రయ విక్రయాల్లో ఒత్తిడులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం. అవమానాలు పొందే సూచన. ఇతరులపై ఆధారపడడం.   ఆకస్మిక ఇబ్బందులు సూచన. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది. అన్నదానం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుకూలతలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. భాగస్వాములతో అనుబంధాలు వృద్ధి చెందుతాయి. నూతన పరిచయాలు కలిసివస్తాయి. పెట్టుబడులో ముందంజ వేస్తారు. అన్ని రకాల ఆనందాలు ఉంటాయి. లలితా ఆరాధన ముఖ్యం. లలితాసహస్రనామపారాయణ మంచిది.

డా.ఎస్ ప్రతిభ

Last Updated 19, Sep 2018, 9:22 AM IST