ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. అనంతరం సంతృప్తికర వాతావరణం. సంఘంలో గౌరవం లభిస్తుంది. జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. ఔషధ సేవనం చేయాలి. ఇతరులపై ఆధార పడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వామ్య, వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. పలుకుబడి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపు ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వ్యాయామం తప్పనిసరి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెట్టుబడులు విస్తరిస్తాయి. సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల సంతోషం కలుగుతుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మకత పెరుగుతుంది. అధికారిక ఆలోచనలు అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపు ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహార నియమాలు పాటించాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. అధిక వ్రమ అవసరం. అతిధి గృహాలు లాభిస్తాయి. సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో సమయ పాలన మంచిది. కిం సంబంధ ఇబ్బందులు ఏర్పడతాయి. నిల్వ ధనంపై ఆలోచన ఉంటుంది. అధికారిక ఆనందాలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పరాక్రమం పెరుగుతుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. తెలియని ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్ చాతుర్యం తగ్గుతుంది. పనుల్లో ఒత్తిడి అధికం. వాగ్దానాలు నెరవేరవు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. పాదాల సంబంధ నొప్పులు ఉంటాయి. అనుకోని భయం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. పనులు పూర్తి చేయడానికి పట్టుదల అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉండదు. గుర్తింపుకోసం ఆరాటపడతారు. దురాశ ఉంటుంది. ఉన్నతులతో పరిచయాలు. అన్ని విధాల సహకారం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. విశ్రాంతికోసం ఎదిరిచూపులు ఉంటాయి. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. చేసే పనుల్లో నైపుణ్యం ఏర్పడుతుంది. ధృఢ నిశ్చయంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. అన్నిరకాల ఆదాయాలు ఉంటాయి. విశాల దృక్పథం ఉంటుంది. గురువులపై గౌరవం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విద్య ద్వారా గౌరవం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ