ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికల్లో లోపాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసాధన అవసరం. నూతన పరిచయాల వల్ల ఆటంకాలు ఉంటాయి. సామాజిక అభివృద్ధి లోపిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికం అవుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అన్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాల్లో లోపాలు ఏర్పడుతాయి. కమ్యూనికేషన్స్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పనుల సాధనలో ఆటంకాలు ఏర్పడతాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాగ్దోధరణి వల్ల ఇబ్బందులు వస్తాయి. అనవసర మాటలు మాటలాడరాదు. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. దానధర్మాలకు, మంచి పనులకు ఖర్చు చేయడం మంచిది. మధ్యవర్తిత్వాలు పనికిరావు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికల్లో లోపాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసాధన అవసరం. నూతన పరిచయాల వల్ల ఆటంకాలు ఉంటాయి. సామాజిక అభివృద్ధి లోపిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికం అవుతుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విహార యాత్రలు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. రహస్య స్థావరాలపై దృష్టి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులకోసం తపిస్తు ఉంటారు. తొందరగా అవి లభించవు. సమిష్టి ఆశయాలకోసం ఆరాటపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. స్వార్థంపై దృష్టి ఉంటుంది. సమిష్టి లాభాలకోసం ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. రాజకీయాలపై దృష్టి ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం అవుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై కాంక్ష ఉంటుంది. ఆ ప్రయత్నాలపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. చిత్త చాంచల్యం పెరుగుతంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విశాల భావాలు ఏర్పడతాయి. ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. న్యాయ అన్యాయాల విచారణ చేస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యశాలలకై ఖర్చు చేస్తారు. పరాధీనులౌతారు. శ్రమలేని సంపాదనపైదృష్టి ఏర్పడుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మోసపోయే ప్రమాదం ఉంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పలుకుబడికోసం ఆరాట పడతారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పనుల ఒత్తిడి పెరుగుతుంది. అనవసర పనులు అధికం అవుతాయి. కాలం, శ్రమ, ధనం వృథా అవుతాయి. శతృవులపై విజయం సాధిస్తారు. ఏపనైనా పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పోటీల్లో శ్రమతో గెలుపు ఉంటుంది. ఋణాలపై దృష్టి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికం. ఔషధ సేవనం చేస్తారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంతానం వల్ల అసౌకర్యం ఉంటుంది. మానసిక ప్రశాంతతకై ఆరాటం. సృజనాత్మకతను కోల్పోతారు. అతీంద్రియ శక్తులపై దృష్టి పెడతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. మనసు ప్రశాంతతకై ప్రయత్నం అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలవలన ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆహారం వల్ల సమస్యలు వస్తాయి. విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా జపం చేసుకోవడం మంచిది.