06 సెప్టెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Sep 6, 2019, 7:14 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక చికాకులు అధికం అవుతాయి. ఏ పనిని శ్రద్ధతో పూర్తి చేయలేరు. ఆలోచనల్లో పరివర్తన చేసుకోవాలి. అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సృజనాత్మకత పెంచుకోవాలి. పనులలో నూతనోత్సాహం పెంచుకోవాలి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక చికాకులు అధికం అవుతాయి. ఏ పనిని శ్రద్ధతో పూర్తి చేయలేరు. ఆలోచనల్లో పరివర్తన చేసుకోవాలి. అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సృజనాత్మకత పెంచుకోవాలి. పనులలో నూతనోత్సాహం పెంచుకోవాలి. ఓం నమఃశ్శివాయ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : గృహ సౌకర్యాలు సమకూరుతాయి. వాహనాలు సమయానికి లభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు మొండి తనంతో పూర్తిచేస్తారు. ఆహారం సమయానికి లభిస్తుంది. మృష్టాన్నభోజనంపై దృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. విస్తరణ, సేవా విభాగాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది. వ్యాపారస్తులు కొంత జాగరూకులై ఉండడం మంచిది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాక్‌ చాతుర్యం పెరచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. నిల్వ ధనం పెంచుకునే ఆలోచన చేస్తారు. లాభాలు అన్నీ కలిసి వస్తాయి. ఆభరణాలు మొదలైనవి సమకూర్చు కునే ప్రయత్నం చేస్తారు. పండుగ వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. పని పూర్తిచేయడంలో పట్టుదల అవసరం. కార్యనిర్వహణ శక్తి అధికం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. ఊహించని చికాకులు, పాదాల నొప్పులు, అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు పెరుగుతాయి. అన్ని రకాల విహారాలు యాత్రలు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : లాభాలు సద్వినియోగం అవుతాయి. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. దురాశ పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. శారీరక బలం పెంచుకునే  ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపార విషయాల్లో చొరవ చూపిస్తారు. ఇతరులపై ఆధారపడతారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది.  అధికారులతో అనుకూలత పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పరిశోధకులకు అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం పెరుగుతుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. పరాక్రమం పెరచుకుంటారు. సజ్జన సాంగత్యం ఏర్పడతాయి. తపస్సు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. సంతృప్తి లోపం పెరుగుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శ్రమలేని ఆదాయంపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య  సమస్యలు ఏర్పడతాయి. లాభనష్టాలు సరిసమానంగా చూసుకుంటారు. క్రయ విక్రయాలు అధికం అవుతాయి. ఇతరులపై ఆధారపడతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. నష్టవస్తు పరిజ్ఞానం పెరుగుతుంది. విరోధులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు.  భాగస్వాములకు అనుకూలమైన సమయం. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం దరిదాపుల్లోకి చేరదు. శత్రువులపై విజయం సాధిస్తారు. అప్పులు తీరుతాయి. శత్రువులు పెరుగుతారు. జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!