ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికిపోటీల్లో గెలుపు సాధిస్తారు. శతృవులపై విజయం ఉంటుంది. ఋణాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. కలహాలకు పోకపోవడం మంచిది. అన్ని పోటీల్లో విజయం సాధిస్తారు.
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడులు పెరుగుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటం ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శతృవులపై విజయం ఉంటుంది. ఋణాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. కలహాలకు పోకపోవడం మంచిది. అన్ని పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో తొందర పాటు పనికిరాదు. ఆలోచనల్లో వైవిధ్యం మంచిదికాదు. పరిపాలన సమర్ధత ఉంటుంది. సంతానం వల్ల కాస్త అన్యమనస్కంగా ఉంటారు. జాగ్రత్త అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : గృహం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త అవసరం. మెత్తని ఆహారం మంచిది. తల్లికి దూరంగా ఉంటారు. ప్రాథమిక విద్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. చదువు విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సమీప వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో కష్టనష్టాలు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనవసర ఖర్చులపై దృష్టి సారిస్తారు. జాగ్రత్త అవసరం. శ్రీ
రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది. తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఆలోచనల్లో మొండితనం ఉంటుంది. చక్కటి ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు. అభిరుచుల్లో మార్పులు కనబడతాయి. శ్రీ
రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది. వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆరాటం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : సమిష్టి ఆదాయాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. రాజకీయ పార్టీలపై ఆలోచనలు పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడాలంటే ఆలోచిస్తారు. అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అప్రమత్తత. ఉద్యోగులకు ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పేరు ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం తపన ఉంటుంది. ఒత్తిడితో కూడుకుని పనులు పూర్తిచేస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్య ద్వారా గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దూర దృష్టి అధికం అవుతుంది. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. అధికారం కోసం ఆరాటం ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు ఉంటాయి. పోట్లాటలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ఇతర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ మంత్రజపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ