ఈ వారం( నవంబర్ 9నుంచి నవంబర్ 15 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukondaFirst Published Nov 9, 2018, 10:21 AM IST
Highlights

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. చెడు మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి ఉంటుంది. పరాధీనం ఉంటుంది. లాభనష్టాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య భావన ఉంటుంది. పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. విహార యాత్రల వల్ల అసంతృప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులలో  ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ప్రయత్నం చేస్తారు. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆర్థిక నిల్వలు పెంచుకునే ఆలోచనల్లో ఉంటారు. వాటి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తూనే సంతోషాన్ని కోల్పోతారు. నూతన పరిచయాల వల్ల సంతోషం ఉంటూ అనుకోని సమస్యలు ఏర్పడతాయి. పదిమందిలో గౌరవాన్ని పెంచుకునే ఆలోచనతో తెలియకుండా ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అధిక శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్త అవసరం.  ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్ర జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెంచుకుటాంరు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కొంత శ్రమతో అధిక ఫలితాలను సాధిస్తారు. సామాజిక అభివృద్ధి అనుకూలిస్తుంది. నూతన పరిచయాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు కొంత ఒత్తిడి, కొంత అనుకూలత కలిగి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. లక్ష్మీపూజ మంచి ఫలితాలనిస్తుంది.

 

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సమస్యలు వచ్చే సూచనలు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటూ కొంత ఆలోచనల్లో ఉపశమనం వల్ల ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులు అధిక శ్రమతో కొంత ఫలితాలను సాధిస్తారు. పనులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పు చేసుకోవడం మంచిది. పోటీల్లో గెలుపుకై పరితపిస్తారు. ఋణ సంబంధ ఆలోచల్లో మానసిక ఒత్తిడిఅధికంగా ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. సామాజిక అనుబంధాలు అనుకున్న సంతృప్తినివ్వవు. గౌరవకోసం ఆలోచన పెరుగుతుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహారంలో సమయ పాలన మంచిది. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు తప్పనిసరి. అనారోగ్య సమస్యల వల్ల పనుల్లో ఆలస్యం జరిగే  సూచనలు. ప్రణాళికలు పూర్తిచేయడంలో అధిక శ్రమ అవసరం. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత అవసరం. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తతతో ఉండాలి. లక్ష్మీపూజ, లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. సహకారం వల్ల బద్ధకాన్ని పెంచుకోరాదు. అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలి. కమ్యూనికేషన్స్‌ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకి వస్తే ఒకదాన్ని కోల్పోరాదు. విద్యార్థులకు అధికశ్రమ అవసరం. పనులు పూర్తి చేయడంలో కార్యసాధన అవసరం. ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికం అయ్యే సూచనలు. సంతానం వల్ల జాగ్రత్త అవసరం. పిట్టలకు నీరు పెట్టడం, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : దాచుకున్న ధనం పరుల పాలు అవుతుంది. వాటిపై ఆలోచనలకు తగ్గించుకోవాలి. మాట విలువ తగ్గే సూచనలు ఉంటాయి. వాగ్దానాలు చేయరాదు. వాటివల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి పోయిన ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన పాటించాలి. కిం సంబంధ దోషాలు వచ్చే సూచనలు. పట్టుదలతో కార్యసాధన చేయడం మంచిది. శ్రీదత్త శ్శరణం మమ, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆహారంపై దృష్టి పెరుగుతుంది. దానికోసం అనవసర వ్యయం చేస్తారు. పనులలో పట్టుదల అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గుర్తింపు కూడా ఉంటుంది. గుర్తింపుకోసం కొంత ధనాన్ని, శ్రమను వెచ్చించే ప్రయత్నం ఉంటుంది. ధనాన్ని ఖర్చుపెట్టే సమయంలో జాగ్రత్త అవసరం. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : నిత్యావసర ఖర్చులకు ఖర్చు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. విశ్రాంతిని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధనాన్ని వెచ్చిస్తారు. శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆహారంపై దృష్టి అధికంగా ఉంటుంది.   పనుల్లో ఆలోచనలు పెరుగుతాయి. కిం సంబంధ లోపాలు వచ్చే సూచనలు. ఆర్థిక వ్యవహారాల్లో ఒకికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓం నమశ్శివాయ జపం, పిట్టలకు నీరు పెట్టడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ధన సంపాదన కోసం ముందుగా అధిక ధనాన్ని వెచ్చిస్తారు. విశ్రాంతిని కోల్పోతారు. అనవసర వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. పరాదీనత ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెంచుకుటాంరు. పెట్టుబడులు లాభించటట్లు ఏర్పాటు చేసుకుటాంరు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. స్త్రీల ద్వారా పనులు పూర్తిచేసుకునే ప్రయత్నం.అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. వాటికోసం అధిక శ్రమ పడతారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. గుర్తింపుకై ఆరాట పడతారు. లక్ష్మీపూజ చేయడం, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. ఉద్యోగంలో కష్టకాలం వచ్చే సూచనలు. గౌరవానికి పరితపిస్తారు. వాటికోసం ధన వ్యయం. ధన వ్యయం వల్ల పరపతి పెరుగుతుంది. సౌకర్యాలు పెంచుకుటాంరు. మళ్ళీ అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిని కోల్పోతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. శారీరక సౌఖ్యం తగ్గుతుంది. అనవసర ఒత్తిడి పెరుగుతుంది. గణపతి పూజ చేసుకోవడం మంచిది. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు అధిక ఒత్తిడి ఉంటుంది. ఫలితాలకోసం ఎదురు చూపులు తప్పదు. దూర ప్రయాణాలు చేయాలనే తపన పెరుగుతుంది. గౌరవాన్ని పెంచుకుటాంరు. సౌకర్యాలపై దృష్టి పెడతారు. రాజకీయ విషయాలు ఆసక్తిని పెంచుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఎదురు చూపులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పనులలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.

మేష, వృషభ, మిథున కన్య, రాశులు తెల్లని వస్త్రాలు, అన్నదానం చేయడం మంచిది. శివుని అభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!