ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానం వల్ల సమస్యలు వచ్చే సూచనలు. సృజనాత్మకతను కోల్పోయే ప్రమాదం. పోటీ ల్లో విజయాలు సాధిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి. లాభాలపై కొంత ఆలోచన ఉంటుంది. ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. భాగస్వాములకు ఒత్తిడి అధికం. సామాజిక అనుబంధాలు విస్తరించే అవకాశం. కొంత గౌరవహాని కలిగే సూచనలు. ఊహించని ఇబ్బందులుటాంయి. ఆధ్యాత్మిక చింతన వల్ల మేలు కలుగుతుంది. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. నూతన పనులు వాయిదావేయుట మంచిది. శ్రీరామ జపం మేలుచేస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సౌకర్యాలు అనుకూలిస్తాయి. ఆహారం విషయంలో సంతోషం కలుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా కార్యసాధన ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. తెలిసిన విషయాలు ఆనందకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఉన్నతి ఉంటుంది. అనుకోని సమస్యలుటాంయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. పరాక్రమం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత విషయాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. గౌరవహాని ఉండే సూచనలు. ధనం కోల్పోయే అవకాశాలు. పోటీ ల్లో విజయం ఉంటుంది. భాగస్వాములతో ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త. శ్రీదత్తశ్శరణం మమ.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాటలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపులు అనుకూలిస్తాయి. సహకారం లభిస్తుంది. సోదరవర్గీయులతో అనుకూలత ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. శ్రమాధిక్యం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. మానసిక ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. అన్ని విషయాల్లో వ్యతిరేకతలు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మేలు చేస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మాటలవల్ల అనుకూలత ఏర్పడుతుంది. నిల్వ ధనం పెంచుకుటాంరు. ఖర్చులు ఉన్నా సంతోషంగా పెడతారు. విహార యాత్రలు చేస్తారు. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. ఆహార విహారాదుల్లో సంతృప్తి ఉంటుంది. ఆలోచనల్లో జాగ్రత్త అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతికై తపిస్తారు. పాదాల నొప్పులుటాంయి. దూర ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. బాధ్యతలు సంతృప్తినిస్తాయి. పనుల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలు ఉంటాయి. మాటల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. శ్రమతో కార్యసాధన ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం చేయడంమంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. విందులు వినోదాల్లో పాల్గొటాంరు. విహారయాత్రల వల్ల సంతోషం కలుగుతుంది. సృజనాత్మకత ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. లక్ష్యాలను నెరవేర్చుకుటాంరు. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలు శ్రమ వల్ల సాధించుకోవాలి. ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత ఉంటుంది. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు ఉంటాయి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. పనుల్లో బద్ధకాన్ని తగ్గించుకోవాలి. గౌరవం పెంచుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆహార విహారాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉన్నత విద్యలపై దృష్టి పెడతారు. కీర్తిప్రతిష్టలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మాటల్లో అధికారిక ధోరణి పెరుగుతుంది. అసంతృప్తి ఉంటుంది. భాగస్వాములతో తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు ఉంటుంది. విశ్రాంతిలోపం ఉంటుంది. ఆసుపత్రుల దర్శనం ఉంటుంది. జాగ్రత్తగా మెలగాలి. కాలం, ధనం వృథా అవుతుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని ఇబ్బందులుటాంయి. ఊహించని సంఘటనలుటాంయి. వ్యతిరేక ప్రభావాలుటాంయి. కార్యనిర్వహణలో ఇబ్బందులు ఉంటాయి. నిర్ణయాల్లో ఒత్తిడులు ఉంటాయి. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాలను సాధిస్తారు. సంతోషంగా ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది. లాభాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఖర్చులు పెట్టుబడులు అధికం. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీ ల్లో విజయం ఉంటుంది. శత్రువులపై గెలుపు సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. భాగస్వాములతో అనుకూలత ఉంటుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానంతో సంతృప్తి. సృజనాత్మకత పెరుగుతుంది. శ్రమ, కాలం, ధనం వ్యర్థం అయ్య సూచనలు. తొందరపాటు పనికిరాదు. ఆలోచనల్లో లోపాలుటాంయి. జాగ్రత్త. శ్రీ మాత్రే నమః జపం మేలు చేస్తుంది.
డా.ఎస్.ప్రతిభ
సంబంధిత వార్తలు
మిథునరాశిపై గురుగ్రహ అనుగ్రహం ఎలా ఉంది
30 నవంబర్ 2018 శుక్రవారం రాశిఫలాలు