ఈ వారం( నవంబర్ 16నుంచి నవంబర్ 22 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukonda  |  First Published Nov 16, 2018, 10:49 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. అన్ని పనుల్లో అనుకూలతలు పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. స్త్రీల వలన ఆదాయం పెంచుకునే మార్గం చూస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసరఖర్చులపై దృష్టి ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం ఉంటుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక వాహన సౌఖ్యం. సంఘంలో గౌరవం పెంచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. సౌకర్యాల వల్ల సంతోషం పెరుగుతుంది.  పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. నిత్యావసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. ప్రయాణల్లో జాగ్రత్తలు అవసరం. విశ్రాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి. విందుభోజనాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేసే వృత్తుల్లో లోపాలు వచ్చే సూచనలు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తిని పెంచుకుటాంరు. సమిష్టి ఆదాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనారోగ్య సమస్యలు సూచితం. వైద్య శాలల సందర్శనం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తత అవసరం. విందుభోజనాలపై దృష్టి ఉంటుంది. దూర దృష్టి ఏర్పడుతుంది. విద్యార్థులు అధక శ్రమ అవసరం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుది. సకల సౌకర్యాలు పొందాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వచ్చిన సంపదను జాగ్రత్తగా వినియోగించాలి. బంధువులతో జాగ్రత్త అవసరం. స్నేహ సంబంధాలు కోల్పోయే సూచనలు. పరస్పర సహకారం లోపించవచ్చు. పదిమందిలో గౌరవాన్ని కాపాడుకుటాంరు.   అనారోగ్య సమస్యలు సూచితం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. జాగ్రత్తలు వహించాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శత్రువులపై విజయంకోసం ఆలోచన. పోటీల్లో గెలుపు సాధనకు తపనపడతారు. ఋణ ఆలోచనలను తగ్గించుకునే ప్రయత్నం. విద్యార్థులకు శ్రమ తక్కువ ఫలితాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుకుటాంరు. పలుకుబడికోసం ఆరాటం. అనారోగ్య సమస్యలు వస్తాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయతలు తగ్గుతాయి. విద్యార్థులు కష్టపడి చదవాలి. శత్రువులపై విజయానికై ప్రణాళికలు వేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాలు అంతగా అనుకూలించవు.  గౌరవంకోసం ఆరాటం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండడం అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విషయంలో జాగ్రత్తలు. సౌకర్యాల వల్ల ఒత్తిడి లేకుండా ఆలోచన. భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడికి దూరం కావాలి. సంతాన సంబంధ ఆలోచనలు ప్టించుకోరాదు. శత్రువులపై విజయానికై ఆలోచన, పోటీల్లో గెలుపు ప్రయత్నాలు చేస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గించుకుటాంరు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కింసంబంధ లోపాలు వచ్చే సూచనలు. అనవసర ఒత్తిడులు వచ్చే సూచన కనబడుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్త అవసరం. మాట విలువను పెంచుకునే ప్రయత్నం చేయాలి. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. పరాక్రమం పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. గౌరవం పెంచుకునే మార్గాలకై అన్వేషణ. ఆహారం సమయానికి తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు సూచితం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మాట విలువ తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో గౌరవ హాని ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. గౌరవహానిజరిగే సూచనలు. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారం సమయానికి తీసుకోవాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు కోసం ఆరాట పడతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. తరచుగా ప్రయాణాలు చేసే అవకాశం. కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మాటలో మృదుత్వాన్ని పెంచుకోవాలి. తాము ఇచ్చే సహకారం ఉంటుంది. పరాక్రమం తగ్గుతుంది. సహకారంలోపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విద్యార్థులు ఎక్కువ శ్రమపడతారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం. చిత్త చాంచల్యం ఉంటుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. రహస్య స్థావరాల్లోకి వెళ్ళే ఆలోచనలు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. మాట విలువ తగ్గుతుంది. భయం పెంచుకుటాంరు. కుటుంబంలో గౌరవం కోసం ఆరాట పడతారు. దాచుకున్న ధనం ఖర్చు చేయాల్సిన సమయం.

డా.ఎస్.ప్రతిభ

మరిన్ని వార్తలు

ఏ రాశివారు ఏ దేవుడిని పూజించాలి..?

click me!