వాస్తు ప్రకారం.. ఉదయం లేవగానే వీటిని చూడకూడదు..!

Published : Mar 07, 2022, 02:35 PM IST
వాస్తు ప్రకారం.. ఉదయం లేవగానే వీటిని చూడకూడదు..!

సారాంశం

అదే విధంగా కొన్ని చేయడం వల్ల.. చెడు కూడా జరుగుతుందట. మరి  నిద్ర లేవగానే.. ఏ పనులు చేయకుంటే.. మన రోజు బాగుంటుందో తెలుసుకుందాం..   

వాస్తు శాస్త్రం మనకు ఎన్నో విషయాల గురించి చెబుతుంది. కాగా.. వాస్తు ప్రకారం.. ఉదయం లేవగానే.. మనం కొన్ని వస్తువులను చూడకూడదట. వాటిని చూడటం వల్ల..  అవి మన రోజు పై ఎఫెక్ట్ చూపిస్తాయట. మరి.. ఉదయం లేవగానే.. ఏవి చూడకూడదో ఓసారి చూద్దాం..


ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చాలా పనులు చేస్తాం. అయితే.. వాస్తు ప్రకారం.. కొన్ని పనులు చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందట. అదే విధంగా కొన్ని చేయడం వల్ల.. చెడు కూడా జరుగుతుందట. మరి  నిద్ర లేవగానే.. ఏ పనులు చేయకుంటే.. మన రోజు బాగుంటుందో తెలుసుకుందాం.. 


చాలా మందికి లేచిన వెంటనే అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది. అయితే మనం ఇలా చేయకూడదు. వాస్తు ప్రకారం, మనం ఉదయం లేవగానే, అద్దంలో చూసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల శక్తి ప్రభావం చూపుతుంది. దాని వల్ల నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటామట.

కావాలంటే.. ఉదయం లేచిన తర్వాత.. ముఖం, నోరు శుభ్రం చేసుకున్న తర్వాత అద్దంలో చూసకోవచ్చట. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ మీ మీద ఉండదట.

ఉదయం పూట కడగాల్సిన  పాత్రలు, మిగిలిపోయిన వస్తువుల కోసం చూడకండి. అందుకే రాత్రిపూట వంటగదిని శుభ్రం చేయాలని అంటున్నారు. ఉదయం లేవగానే మిగిలిపోయిన వాటిని చూడటం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

వాస్తు ప్రకారం ఇతరుల నీడ మనం.. మన నీడ ఇతరులు చూడకూడదట. అది మనకు మంచిది కాదట.

 వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే గడియారాన్ని చూడకూడదట. ఉదయాన్నే గోడ గడియారం చూడటం వల్ల  ఆరోజు మనకు ఎవరితోనైనా గొడవ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుకే.. బెడ్రూం లో గడియారం పెట్టుకోకపోవడమే మంచిదట.

చాలా మంది ఇంట్లో అడవి జంతువులను ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. అందంగా ఉండాలని వాటి బొమ్మలు, ఫోటోలతో గదిని నింపుతారు. అయితే.. ఉదయం లేవగానే.. వాటిని  చూడటం వల్ల.. ఆ రోజంతా సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

PREV
click me!

Recommended Stories

Mars Sun Conjunction: ఒకే రాశిలో 3 గ్రహాలు.. ఈ 3 రాశులవారికి ఊహకందని లాభాలు!
Zodiac sign: ఈ రాశి వారికి వ‌చ్చే వారం ప‌రీక్షా స‌మ‌యం.. చాలా ఓపిక‌తో ఉండాలి. లేదంటే..