ఈ ఏడాది ఉగాదిని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తాం. మరి ఈ తెలుగు సంవత్సరం ప్రకారం... ఈసంవత్సరం మన దేశ, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ప్రతి ఏడాది ఉగాది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తుంది. ఈ ఏడాది ఉగాది ఈ నెల 22 న వచ్చింది. ఈ పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాదిని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తాం. మరి ఈ తెలుగు సంవత్సరం ప్రకారం... ఈసంవత్సరం మన దేశ, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఈ నవ నాయకులలో 8 ఆధిపత్యము లు శుభలకు ఒక ఆధిపత్యం పాపులకు వచ్చుటచే దేశ పరిస్థితులు బాగుండును. సుస్థిరపరిపాలన ప్రజారంజకంగా పరిపాలన చేయుదురు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఉన్నప్పటికీ మన దేశ పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక రంగం పురోభివృద్ధి చెందుతుంది. వృద్ధి శాతం పెరుగును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. ప్రజా సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్రాలు పోటా పోటీగా అమలు చేస్తారు. ప్రజల యొక్క మన్ననలు పొందగలరు. ప్రతిపక్షం వారు విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారు.
undefined
ప్రభుత్వము నందు తన వర్గీయ వారితో కొన్ని వ్యతిరేకతలు ఏర్పడవచ్చును. ఆయనను సమర్ధించుకోగలరు. భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. క్రీడారంగంలో అనేక విజయాలు లభించును. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. పర్యాటక రంగం బాగుంటుంది. ఈ సంవత్సరం మూడు కొంచెం కాబట్టి దేశమంతా మంచి వర్షాలు కురుస్తాయి. జలాశయాలు సంపూర్ణముగా నిండగలవు. జల వివాదములు పరిష్కారములు ఏర్పడగలవు. విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయదురు. గృహ నిర్మాణాధి వ్యవహారములు మందగించును.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పధకాలు జోరు పెరుగుతుంది. ప్రభుత్వం అధికారులతో కూడి సమన్వయంతో ప్రజల మనస్సుని చూరుగొనేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంది. గత సంవత్సర పాలనకు ఇప్పటికి పూర్తి తేడా కనపడుతుంది. అయితే ఎంత చేసినా లోపాలు కనపడుతూనే ఉంటాయి. వాటిని చిన్న దాన్ని పెద్దది చేసేందుకు ఎదురుచూసేవారు ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఉంటారు. మార్పులు కొన్ని అనివార్యము అన్న విషయం అర్దమవుతుంది. సంవత్సరం మధ్యలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజామోదం పొందకపోవచ్చు. ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. కొన్ని సార్లు చేయని వాటికి నిందలు పడతారు. గ్రహాల శుభదృష్ణి తో వాటిని కొంతవరకూ జయించవచ్చు.